Labels,

1aaఘంటసాల గీత (1) 1ab108శుక్రవారములువేంకటేశ్వరునిపాదములకుఅభిషేకం (1) 1abనీఆనందంఎక్కడవుందోతెలుసా (1) 1abసులువుగాఆనందంగాబ్రతకడంఎలా (1) 1aవివాహానికిసరిపడునక్షత్రములు (1) 1aశిశువుపుట్టిననక్షత్రముమంచిదాకాదాదోషాలువున్నాయాఇక్కడచూడండి (1) 1aసంతోషం (1) 1bనాపేరునిబట్టినక్షత్రము (1) 1cనవగ్రహరెమిడీస్ (1) 1m100tables (1) 1m100tablesinsinglesheet (1) 1m100tableswithname (1) 1m1to100tablesfor20 (1) 30days (1) 5artbrushes (1) 6qus (1) 9Bhagavadgita (1) 9bottons (1) agecalculatorinyearsmonths (1) ashtotharalu (1) Business (1) Dealoftheday (1) differentappsinthispage (1) differentbrushes (1) DynamicStoryGenerator (1) Flippingcard (1) ghantasalagita (1) Govinda (1) Lawofatraction (1) lovestorygenerator (1) Money (1) MoneyBusinessGovernmentjob (1) muggulu (1) newstylishbuttons (1) omnamahshivaya (1) Onemovement (1) peacockcards (1) super app (1) Superbrush (1) superPasswordGenerator (1) Varietycard (1) vasthu (1) vasthu planer (1) vastu tips (1) Weddinginvitationgenaretor (1) WeddingInvitationGenerator (1) Whatisthis (1) wow app (1) yourrasi (1) అధ్భుతమైనరెమిడీమీకోసం (1) ఆయుర్వేదం (1) ఇక్కడమీపేరునిటైపుచేసిమీలక్కీనెంబర్స్ (1) ఇలావెరైటీగామెసేజ్పంపించండిసర్ప్రైజ్అవుతారు (1) ఏపూజఅయినాపాటించాల్సిననియమాలు (1) కాశీయాత్రవిధివిధానం (1) గ్రామదేవతలవివరాలు (1) తెలుసుకోండి (1) దేవాలయనియమాలు (1) ధనలక్ష్మీప్రాప్తికి (1) ధనాకర్షణ (1) నక్షత్రాలు (1) నవగ్రహపూజలు (1) నాకుబీపీషుగరులేదుఎందుకంటే (1) నువ్వుఎవరుఇక్కడసులువుగాతెలుసుకో (1) నేనుచేస్తున్నతప్పులుఏమిటి (1) పిల్లలకునేర్పాల్సినధ్యానశ్లోకములు (1) పిల్లలకునేర్పించండి (1) బూడిదగుమ్మడికాయకట్టేవిధానం (1) భార్యాభర్తలుప్రశాంతజీవనసూత్రాలు (1) మనసుబుద్ధిఆత్మఎక్కడవుంటాయి (1) మీగోత్రనామాలతోకాశీమహాక్షేత్రంలోమహాశివరాత్రిఅభిషేకం (1) మీనక్షత్రానికిడబ్బులుతెచ్చే3నక్షత్రాలు (1) మీరుమగపెళ్ళివారాఆడపెళ్ళివారాఇక్కడతెలుసుకోండి (1) మీలక్కీనంబర్స్ తెలుసుకోండి (1) రాశిఏదివస్తుంది (1) విధులు (1) వెరైటీక్విజ్ (1) వెరైటీమెసేజ్ (1) శిశువుపుట్టినసమయాన్నిఎలానిర్ణయించాలి. (1) సందేహాలుసమాధానాలు (1) సప్తవ్యసనాలుఅంటేఏమిటి? (1)

3 Apr 2024

భార్యాభర్తలు ప్రశాంత జీవనసూత్రాలు

  భార్యాభర్తలు ప్రశాంత జీవన సూత్రాలు

కుటుంబం అంటే సామరస్యం, అంతే తప్ప సాధించడాలు, కోపాలు, పగలు, ప్రతీకారాలు కాదు, ఎవరూ ఎవరికీ బానిసలు కాదు, పనివారూ కాదు, ఎవరి రూపాయి వారే సంపాదించుకోవాలి , ఒక రాజులా కూర్చో పెట్టి చేతికి కాఫీ అందిస్తే మూతి ముందుకు పెట్టి, చప్పుడు చేస్తూ త్రాగేసి ఊరుకోకుండా , నువ్వు కూడా భార్యని రాణిలా కూర్చోపెట్టి చేతికి కాఫీ అందిస్తే అందులోని శ్రమ, బాధ్యత, అందం , ఆనందం, తృప్తి, తెలుస్తుంది. ఎవరి పని వారే చేసుకోవాలి, వీలైతే ప్రక్క వారికి పనిలో సహకరించాలి, ఖర్చు పెట్టే ప్రతి  రూపాయి  అందరి అంగీకారంతోనే ఖర్చు చేయాలి ,  ఎప్పుడు ఎవరి మధ్య ఏ వాదనలు జరిగినా ఎప్పటికప్పుడు మరిచిపోయేవి మరిచి పోవాలి, క్షమించే అవకాశం వున్న చోట క్షమించండి, వదిలేయండి, అంతే తప్ప మనుషులనూ , వారి వల్ల వచ్చే సమస్యలనూ పట్టుకుని వేళ్ళాడకండి , అప్పుడెప్పుడో జరిగి పోయిన వాటిని తిరిగి గుర్తు చేసుకుని సాధించడం తప్పు, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు, మంచి చెడులు తెలుసుకుంటారు, మారుతూ ఉంటారు, మనసు ఆరోగ్యం పాడు చేసుకోకుండా వీలైనంత ప్రశాంతంగా ఉండండి, ఇంట్లో మిగిలిన వారిని వాళ్ళను వారిలాగానే వుండ నివ్వండి , మీరు మీ లాగే వుండండి, ఏమీ కాదు, భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. భార్య భర్తలు ఎప్పుడు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు.

ఒకరి అభిప్రాయాలకు ఒకరు గౌరవం ఇచ్చి, ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని, ఒకవేళ భాగస్వామి అభిప్రాయాలు నచ్చకపోతే, వాటిని మార్చుకునేలా నిదానంగా చెబుతూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది, అంతే తప్ప వారి నెత్తిమీద కూర్చుని మారాల్సిందేనని బలవంతం చేస్తే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, వాళ్ళ టైము రాగానే నిన్ను తొక్కేస్తారు,

భర్త యొక్క స్వభావం, భర్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఏం మాట్లాడుతాడు ఏంటి అన్ని విషయాలపై భార్యకు అవగాహన ఉండాలి. భర్త ఇష్టాయిస్టాలకు భార్య ప్రాధాన్యత ఇవ్వాలి. భర్త పైన భార్యకు అంతే సంపూర్ణ విశ్వాసం కూడా ఉండాలి. అలాగే భార్య పైన కూడా భర్తకు పూర్తి నమ్మకం ఉండాలి. మంచి విషయం ఏదైనా చెప్ప దలుచుకుంటే చెప్పండి అంతే విన్నారు వినలేదు, వీటితో మీకు సంబంధం లేదు,  భార్య భర్తల మధ్య అనుబంధం గట్టిగా ఉండాలంటే పాటించాల్సిన మరొక సూత్రం. ఒకరిపై ఒకరు గౌరవాన్ని కలిగి ఉండటం. భార్యాభర్తలిద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి. ఒకరిపై ఒకరు తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి. ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా భార్య, భార్యను కించపరిచేలా భర్త ఎప్పుడు ప్రవర్తించకూడదు. భార్యాభర్తలు ఇరువురూ తమ భాగస్వామి యొక్క వ్యక్తిత్వాన్ని అగౌరపరిచేలా ప్రవర్తించకూడదు. భార్య భర్తల ఇద్దరి మధ్య సంపూర్ణ గౌరవం ఉంటే భార్య భర్తల బంధం మరింత బలంగా ఉంటుంది.భార్య భర్త కోసం, భర్త భార్య కోసం సమయాన్ని కేటాయించాలి.కూర్చోవాలి మాట్లాడుకోవాలి, కబుర్లు, సరదాలు, వుండాలి, ఒకరికొకరు ప్రోత్సాహం ఇవ్వాలి మానసిక బలాన్ని ఇవ్వాలి, 

భార్య భర్తలు ఎంత సంపాదించినా, ఏ ఉద్యోగాలు చేసినా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం తాలూకు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించకూడదు. ఇద్దరూ కలిసి మెలిసి ఉండడానికి ప్రయత్నించాలి.

ఎదుటి మనిషి కోరేది మీరు ఇవ్వ లేక పోవచ్చు, మీరు ఇవ్వ కలిగినది ఇవ్వండి అంతే,  భార్య భర్తలు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకోవాలి. ఒకరికి ఒకరు అర్ధమయ్యేలా చెప్పుకోవాలి

ఏ మగాడు నేను మగాడిని అని చెప్పడు, ఏ ప్రేమికుడు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడు, ప్రేమిస్తాడు, అంతే, రెండు శరీరాలలో, రెండు మనసుల్లో, ఒకేసారి పుడితే అది ప్రేమ,  రెండుగా కనిపిస్తూ ఒకటిగా వుండేది ప్రేమ , దానికి భాష లేదు, మనసు మాత్రమే వుంటుంది, దానికి ఏదీ చెప్పనవుసరం లేకుండానే, అన్నీ తెలుస్తాయి, తన భార్య స్వభావం ఏంటి? ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది? వంటి అన్ని విషయాలపై భర్తకు కూడా అవగాహన ఉండాలి. ఆమె ఇష్టాయిస్టాలకు భర్త ప్రాధాన్యత ఇవ్వాలి. భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి సంపూర్ణంగా అవగాహన ఉన్నప్పుడు, ఒకరిపై ఒకరికి బలమైన విశ్వాసం కలుగుతుంది. ఈ బలమైన విశ్వాసమే భార్యాభర్తల బంధానికి బలమైన పునాదిగా మారుతుంది. వారి దాంపత్య జీవితం సుఖంగా సాగడానికి సోపానం అవుతుంది.

భార్యాభర్తలు ప్రశాంత జీవనసూత్రాలు

   భార్యాభర్తలు ప్రశాంత జీవన సూత్రాలు కుటుంబం అంటే సామరస్యం, అంతే తప్ప సాధించడాలు, కోపాలు, పగలు, ప్రతీకారాలు కాదు, ఎవరూ ఎవరికీ బానిసలు కాదు,...