వెంకట చాగంటి ( అమెరికా )వారి మాటల్లో
వేదములు రహస్యాలు
మనసు ఎక్కడ వుంటుంది?
మనం చూస్తున్నప్పుడు కళ్ళల్లో వుంటుంది, మాట్లాడేటప్పుడు నోటి యందు వుంటుంది, అంటే మనం ఏ భాగంతో పని చేస్తున్నామో ఆ భాగంలో వుంటుంది మనసు, మనం తెలుసుకో లేనంత వేగంగా మనసు ప్రయాణిస్తుంది, మనసు అంటే ఎనర్జీ అది బ్రెయిన్ నుండి ప్రారంభమవుతుంది , నీరసంగా వున్న శరీరంలో మనసు కూడా బలహీనంగానే వుంటుంది, మనసుకు శక్తిని పెంచకలిగితే అది ఎక్కడికైనా వెళ్ళ కలుగుతుంది
బుద్ది ఎక్కడ వుంటుంది?
బుద్ది, ఆత్మ తో కూడి వుంటుంది, ఆత్మ ఎక్కడ వుంటే బుద్ది అక్కడే వుంటుంది, బుద్ది మనసు కన్నా సూక్ష్మ మైనది,
ఆత్మ ఎక్కడ వుంటుంది?
మనిషి మెలకువగా వున్నప్పుడు కుడి కంటిలో వుంటుంది, కళ్ళు లేని వారికి కూడా కుడి కంటిలోనే వుంటుంది, మనిషి స్వప్నంలో కంఠంలో వుంటుంది, గాఢ నిద్రలో ఉన్నప్పుడు హృదయం లో ఉంటుంది, ఆత్మ తో పాటు బుద్ది కూడా అక్కడే వుంటుంది,
జ్ఞానం ఎక్కడ వుంటుంది?
మనసు జ్ఞానం సంపాదించుకుంటుంది,
చేసిన కర్మలు చిత్తం లోకి వెళ్తాయి,
బుద్ది సృష్టి తో పాటే వస్తుంది, ప్రపంచ జ్ఞానం అంతా అందులోనే వుంటుంది, ధర్మం, అధర్మం, అన్నీ వుంటాయి, వాటిని మనం తరిచి తెచ్చుకోవాలి, చాలా సూక్ష్మమైనది,
ఆవేశం లో వున్నప్పుడు మనసు అహంకారం వలన బుద్ధిని సంప్రదించకుండానే స్వతంత్రంగా పనిచేస్తుంది, మనసు మనిషి కంట్రోల్ లో వుంటేనే బుద్ది నుంచి సరైన జ్ఞానం తో సరైన నిర్ణయం తీసుకుంటుంది, బుద్ది తో మాత్రమే పరమాత్మను దర్శించగలం, జిహ్వ చాపల్యం మనస్సుకు వుంటుంది కానీ బుద్ది కి కాదు, బుద్ది ని కాదని మనసు చేసే విరుద్ధమైన పనులన్నీ కర్మలుగా నిక్షిప్తం అవుతాయి,
సూక్ష్మ శరీరాన్ని చూడగలమా?
విజిబుల్ లైట్ వేవ్ లెంగ్త్ కన్నా తక్కువ వేవ్ లెంగ్త్ వున్న దానిని చూడలేము ,
సత్వ, రజః, తమో గుణాలు మూడు పరమాణువులు సంఘాతం వల్ల ఏర్పడేది ప్రకృతి, దాని నుండి మహతత్వం అనగా బుద్ది ఏర్పడుతుంది, దాని వల్ల అహంకారం, దాని తర్వాత పంచ తన్మాత్రలు, వాటి వలన మనసు, దశ ఇంద్రియాలు, అనగా ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, వీటి వల్ల పంచ భూతాలు, వీటి వల్ల జీవుడు, పరమాత్మ,
మనిషి మెలకువలో వున్న పుడు మనసు జాగ్రదవస్థ లో వుంటుంది, నిద్ర లో వున్నప్పుడు మనసు ఇన్ యాక్టివ్ గా వుంటుంది, గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనసు సుషుప్తి లోకి అనగా పూర్తి ఇన్ యాక్టివేట్ స్థితిలో వుంటుంది, అందువలన జంతువులకు ఇన్ యాక్టివ్ గానూ, చెట్లకు పూర్తి సుషుప్తి లోకి మనసు వుంటుంది, చెట్లకు, జంతువులకు, ఆత్మ, బుద్ది, మనసు వుంటాయి కానీ పైన తెలిపిన స్థితిల్లో వుంటుంది, అందువలన చెట్టు, జంతువులు మనసుతో ఏమీ చేయలేవు, కానీ మనిషి సుషుప్తి లోకి వెళ్లినా, అనగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా జ్ఞానం తో వుంటాడు,
60 పరమాణువులు 1 అణువు
2 అణువులు 1 స్థూల వాయువు అంటే ఎలక్ట్రాన్ , ప్రోటాన్, న్యూట్రాన్, లు ఏర్పడుతుంది అవి మూడు కలిస్తే తృణపము ఏర్పడుతుంది అలా అగ్ని, జలము, పృథ్వి, ఏర్పడుతాయి,
ప్రకృతి జీవనం
ఆత్మ జీవనం
మనుష్య జీవనం