మీకు మీరే వైద్యులు
నా అనుభవంలో తెలుసుకున్నది, పెద్దల ద్వారా గ్రహించినది అనేక రహస్యాలు సులువైన భాషతో వివరంగా మీ ముందు ఉంచుతున్నాను , ఒకటికి రెండు సార్లు స్థిమితంగా చదివితే చక్కగా అర్థం చేసుకోవచ్చు అయినా కూడా ఏదైనా అర్థం కాలేదంటే 9490478707 కు మెసేజ్ పెట్టగలరు,
వాతతత్వం గల శరీరం లక్షణాలు
1. తేలికపాటి, బక్క శరీరాకృతి
2. వేగంగా పనిచేయడం
3. క్రమంలేని ఆకలి, అరుగుదల
4. మగత నిద్ర, కలత నిద్ర, నిద్రలేమి
5. ఉత్సాహం, జీవచైతన్యం, ఊహాశక్తి
6. ఉద్వేగం, మారే మూడ్లు
7. కొత్త సమాచారాన్ని త్వరగా గ్రహించడం, త్వరగా మర్చిపోవడం
8. చింతాక్రాంత ధోరణి
9. మలబద్ధకానికి గురికావడం
10. తేలిగ్గా అలసిపోవడం, అతిగా కష్టపడే ధోరణి
11. అలల్లా వెలువడే మానసిక, శారీరక శక్తి
వాతతత్వం ముఖ్యలక్షణం 'మారగలగడం'. వాతతత్వం గలవారి గురించి చెప్పడం కష్టం. పిత్త, కఫ తత్వాల వారిలా ఒకేరకంగా వుండరు. అయితే పరిమాణం, ఆకారం, మూడ్, క్రియలలో వీరి వైవిధ్యత కూడా వీరిని గుర్తించే లక్షణమే. నిశ్చలంగా కాక అలలు అలలుగా వెలువడే మానసిక, శారీరక శక్తి దీనికి కారణం.
1. పగలు లేక రాత్రి ఎప్పుడూ ఆకలిగా వుండడం
2. ప్రేమోద్వేగం, స్థిరమైన మార్పు
3. ప్రతి రాత్రీ వేర్వేరు సమయాలలో నిద్రించడం, భోజనం మానేయడం, సాధారణంగా అపక్రమమైన అలవాట్లు కలిగి వుండడం
4. ఒకరోజు ఆహారం చక్కగా జీర్ణం కావడం, రెండో రోజు సరిగా జీర్ణం కాకపోవడం
5. త్వరగా వచ్చి, త్వరగా మరిచిపోయే ఉద్రేకోద్వేగాలు ప్రదర్శించడం
6. వడివడిగా నడవడం. అనేవి కూడా అతి వాతతత్వ లక్షణాలే.
భౌతికంగా, వాత తత్వం గలవారు మిగతావారికన్నా సన్నగా, చిన్న భుజాలు, చిన్న పిరుదులు కలిగివుంటారు. కొందరి విషయంలో వళ్ళు చేయడం అసాధ్యం; మిగతావారు సన్నగా, నాజూగ్గా వుంటారు. రకరకాల రుచులు మీద ఇష్టం కలిగిన వారున్నా వాతతత్వంగలవారు లావెక్కకుండా ఏదైనా తినగలరు. (కొంతమంది జీవితంలో బరువు విషయంలో బాగా మార్పులకి గురౌతారు. యవ్వనంలో సన్నగా వుండి, మధ్య వయస్సులో లావెక్కుతారు). వాతం పెరిగితే భౌతిక అపసవ్యత ఏర్పడుతుంది. శరీరానికి వుండవలసిన వాటికన్నా బాగా పాడవో లేక పాట్టో అయిన కాళ్ళుచేతులు; బాగా చిన్నవి లేక బాగా పెద్దవి, బయటికి పాడచుకొచ్చి కనిపించేవి అయిన దంతాలు; అతి ఆకలి కలిగి వుండడం వాత లక్షణాలు. వాతతత్వం గలవారిలో ఎక్కువమంది చక్కటి ఆకారం కలిగివున్నా, దొడ్డికాళ్ళు, సన్నటి మడమలు, గూని, బాగా దగ్గరగా లేక బాగా ఎడంగా వుండే కళ్ళు గలవారు కూడా వీరిలో కనిపిస్తారు. ఎముకలు బాగా తేలికగా లేక బాగా పొడవుండి బరువుగా వుంటాయి. కీళ్ళు, ధాతువులు, నరాలు చర్మం అడుగున వుండే కొవ్వు పాఠ పల్చగా వుండడం చేత చక్కగా పైకే కనబడ్తుంటాయి.
శరీరంలోని చలనం అంతటికీ వాతమే కారణం. మన దేహంలోని కండరాలు వాతం వలనే చలిస్తాయి. శ్వాసను నియంత్రించడం, జీర్ణమార్గం ద్వారా ఆహారం కదలడం, మెదడు జారీచేసే ఆదేశాలు నరాల ద్వారా తీసుకుపోవడం చేసేది వాతమే. కేంద్ర నాడీ వ్యవస్థను అదుపు చేయడం వాతం చేసే అతి ముఖ్యమైన పని. వళ్ళు బిగుసుకోవడం, కండరాలు ముడుచుకుపోవడం, తీవ్రమైన వణకు శరీరంలోని వాతం కలత చెందిందనడానికి దృష్టాంతాలు. ఈ దోషం అసమతుల్యతలో పడితే, నరాల అపసవ్యత కనిపిస్తుంది. ఇది సాధారణమైన చింత నుంచి తీవ్రమైన మానసిక విపరిణామాల స్థాయి వరకూ వుండొచ్చు. వాతం ప్రకోపిస్తే, అన్ని రకాలైన మానసిక వికార లక్షణాలూ కనిపిస్తాయి. కనుక వాతాన్ని సమతుల్యతలోకి తీసుకురాగలిగితే అలాటి లక్షణాలన్నీ మటుమాయమవుతాయి.
వాతం పనులు ప్రారంభించడానికి తప్ప వాటిని పూర్తి చేయడానికి వుపయోగపడదు. వాతతత్వం అసమతుల్యతలో పడితే బలంగా కనిపించే లక్షణాలు: అలాటివారు ఏమీ కొనకుండానే బేరాలాడతారు, అంతులేకుండా మాట్లాడతారు, ఎప్పుడూ అసంతృప్తికి లోనవుతారు. కొన్ని సమయాలలో వాతతత్వం గలవారు డబ్బుని, శక్తిని, మాటల్ని వృధా చేస్తూ తమని తామే స్వేచ్ఛగా ఖర్చు చేసుకుంటారు. శరీరమంతటా సమతుల్యతకు బాధ్యత వహించే కారణంగా వాతం సమతుల్యతలో వుంటే అలా చేయడం జరగదు.
ఎక్కువమంది వాతతత్వం గలవారు చింతకు గురౌతారు. విశ్రాంతి లేకుండా చేసే ఆలోచన ఫలితంగా ఏర్పడే నిద్రలేమివల్ల కొన్ని సమయాలలో బాధపడతారు. వీరు బాగా తక్కువగా ఆరు గంటలు లేక ఇంకా తక్కువసేపు మాత్రమే నిద్రిస్తారు. ఇది వయసు పెరిగే కొద్దీ మరీ తగ్గుతుంది. వత్తిడి కారణంగా ఏర్పడే ప్రతికూల మానసిక పరిణామం చింత (భయం). కడుపులో ఇబ్బంది, నమ్మకంలేని జీర్ణశక్తిలతోపాటు దీర్ఘకాలిక మలబద్ధకము, గాస్ ఇబ్బందులు వుంటాయి. ఈ దోషం వలన జీర్ణక్రియలో అపసవ్యత, స్త్రీలలో ఋతుసమయ బాధ సాధారణంగా ఏర్పడుతుంటాయి.
చక్కటి సమతుల్యతగల వాతతత్వ వ్యక్తి అంటురోగాల బారిన పడకుండా ఆనందంగా, ఉత్సాహంగా, శక్తివంతంగా వుంటాడు. మనసు స్వచ్ఛంగా,చురుగ్గా వుంటుంది. అంతర్గత ఆరోగ్యం పెంపొందుతుంది. తమ పరిసరాల్లో మార్పులకు వాతతత్వంగలవారు తీవ్రంగా స్పందిస్తారు. శబ్దం, స్పర్శలకు వీరు వేగంగా, తీక్షణంగా స్పందిస్తారు. బిగ్గర శబ్దాలు ఇష్టపడరు. జీవ చైతన్యం, తీవ్రత, ఉద్వేగపూరితం, అనూహ్యం, ఊహాత్మకం, అతివాగుడు అయిన వ్యక్తిత్వాలన్నీ వాతతత్వ లక్షణాలే. సమతుల్యత లోపిస్తే ఈ వాత తత్వం అలాటి వారిని శక్తిశూన్యుల్ని చేస్తుంది - వారి ఉద్వేగం నీరుగారిపోయి, దీర్ఘకాలిక అలసటకి లేక దిగులుకు లోనవుతారు.
దీని గుణాలన్నిటిలోకి బహుశా అతిముఖ్యమైనది- వాతం ఇతర దోషాలను నడిపిస్తుందనేది. దీనికి అనేక అర్థాలున్నాయి వాతం మొదట సమతుల్యత కోల్పోయి రోగపు తొలి స్థితుల్ని కలుగజేస్తుంది; ఇది ఇతర దోషాలలా నటించి, సమస్యకు కారణం పిత్తమో లేక కఫమో అనే ఆలోచనను కలిగిస్తుంది (నిజానికి అపసవ్యతలలో సగంపైగా వాతం కారణంగానే సంభవిస్తాయి); ఇది సమతుల్యతలో వుంటే పిత్తం, కఫం కూడా సాధారణంగా సమతుల్యతలోనే వుంటాయి. అందుకే దీన్ని దోషాలలో రాజుగా పరిగణిస్తారు. ఆ కారణంగా, ప్రతి ఒక్కరి విషయంలో వాతాన్ని సమతుల్యతలో వుంచడం అత్యంత ముఖ్యం.
వాతతత్వం గలవారు తగినంత విశ్రాంతి తీసుకోవడం, అతిగా పనిచేయకుండా వుండడం, క్రమబద్ధమైన జీవన విధాన అలవాట్లపట్ల బాగా శ్రద్ధ చూపడం చాలా అవసరం. చాలామందికి ఇవి సహజంగా కనిపించకపోవచ్చు. అయితే వీటివల్ల దైహిక లేక మానసిక సమస్యలలో త్వరితమైన మెరుగుదల సాధ్యమవుతుంది. సమతుల్యతను గ్రహించగలిగే సహజ జ్ఞానం మనకు వాతంవల్లే వస్తుంది. దాన్ని కాపడుకోవడం చాలా ముఖ్యం.
పిత్తతత్వ శరీరం లక్షణాలు
1. మధ్యస్థపు శరీరాకృతి
2. మధ్యస్థాయి శక్తి, సహనశీలత
3. మంచి ఆకలిదప్పులు, మంచి జీర్ణశక్తి
4. వత్తిడిలో ఆగ్రహానికి, చిరాకుకి గురికావడం
5. చక్కటి చర్మం లేక ఎర్రమచ్చలు గల ఎరుపురంగు చర్మం
6. ఎండ, వేడి వాతావరణం పట్ల విముఖత
7. సాహస ప్రవృత్తి, సవాళ్ళంటే ఇష్టత
8. సునిశిత మేధస్సు
9. స్వల్పంగా, అర్థవంతంగా వుండే సంభాషణ
10. భోజనం మానలేకపోవడం
11. పాడవాటి, కాఫీపొడిరంగు లేక ఎరుపు జుత్తు
పిత్తతత్వ ముఖ్యలక్షణం తీవ్రత. ముదురు ఎరుపురంగు జుత్తు, ఎరుపు రంగు మొఖము గలవారెవరైనా సరే ఎక్కువ మొత్తంలో పిత్తాన్ని కలిగి వున్నవారే. అలాగే సాహసగుణం కలవారు, తెలివిగా మాట్లాడేవారు. తక్కువగా మాట్లాడేవారు, ధైర్యంగలవారు, వాదించేగుణం కలవారు, లేక అసూయాపరులు కూడా పిత్తతత్వం గలవారే. పోరాట గుణం పిత్తంలో సహజ లక్షణం. అయితే అది బయటపడాలని లేదు. సమతుల్యతలో వుంటే, పిత్త తత్వంగలవారు సంతోషంగా, ఉత్తేజంగా, ప్రేమగా, సంతృప్తిగా వుంటారు. సంతోషంతో వెలిగిపోయే మొఖం పిత్తానికి గుర్తు.
1. భోజనం అరగంట ఆలస్యం అయితే ఆకలితో అలమటించి పోవడం
2. సమయం తప్పక పనులు చేయడం, సమయం వృధా అయితే కోపగించకోవడం
3. ఉక్కపోతే, దాహం అనిపించి రాత్రిళ్ళు మెలుకువ రావడం
4. పరిస్థితిని అదుపులోకి తీసుకోవడం లేక అది తనకు తప్పనిసరి అని భావించడం
5. అత్యాశపరులని, పక్కవార్ని చులకన చేస్తారని, లేక అప్పుడప్పుడు ఇబ్బంది పెడతారని ఇతరులు భావిస్తున్నట్లు అనుభవం విద తెలుసుకోవడం
6. నడిచేప్పుడు నిశ్చయాత్మకంగా అంగలు వేయడం
అనేవి కూడా అతి పిత్తతత్వ లక్షణాలే. దైహికంగా తగిన పొందికతో మధ్యస్థాయి ఆకృతి కలిగి వుంటారు పిత్త తత్వం గలవారు. ఎలాటి ఒడిదుడుకులు లేకుండా వీరు తమ బరువునుసమతూకంలో వుంచుకుంటారు; అవసరాన్ని బట్టి కొద్ది బరువు పెరగడం లేక తగ్గడం వీరికి కష్టం కాదు; ముఖతీరు పొందికగా వుంటుంది; కళ్ళు మధ్యరకం పరిమాణంలో వుండి, వాడి అయిన చూపు వుంటుంది. చేతులు, కాళ్ళు కూడా మధ్యస్థంగా వుంటాయి; కీళ్ళు సాధారణంగా వుంటాయి. పిత్తకి చెందిన జుత్తు, చర్మం తేలికగా గుర్తించొచ్చు. సాధారణంగా జుత్తు పొడుగ్గా, చక్కగా, తిన్నగా ఎర్రగా లేక ఇసుకరంగులో వుండి, వయసుకు ముందే నెరిసే గుణం కలిగి వుంటుంది. బట్టతల, రాలే జుత్తు, లేక పలుచబడే జుత్తు అధిక పిత్తానికి సంకేతం. చర్మం వెచ్చగా, మృదువుగా, చక్కగా వుంటుంది. చర్మం అంత తేలిగ్గా కందదు కానీ తరచుగా బొబ్బలెక్కుతుంది (ముఖ్యంగా చక్కటి, మంచి జుత్తు వున్నపుడు) ఈ కారణంగానే వీరు ఎండలో వుండడానికి యిష్టపడరు. ఇది వారి సహజ లక్షణం. వీరి చర్మం మీద ఎన్నో ఎర్రమచ్చలు, పుట్టుమచ్చలు వుంటాయి.సహజంగా పిత్తతత్వం గలవారు సునిశిత దృష్టి, మేధస్సు, మంచి ఏకాగ్రతాశక్తి గలవారు. క్రమబద్ధంగా వుండడం, తమ ధనం, శక్తులను చక్కగా నిర్వహించడం, పనులు సమర్థవంతంగా చేయడం అనేవి వీరి సహజ లక్షణాలు. విలాసాల మీద ధనం ఖర్చు చేయడం అనేది వీటిలో ముఖ్యమైన మినహాయింపు. వీరు తమ చుట్టూ మంచి వస్తువులుండాలని కోరుకుంటారు. ప్రపంచాన్ని కంటితో చూసి వీరు స్పందిస్తారు.పిత్తతత్వం గలవారిలో ప్రతి విషయంలో వేడి బయటపడుతుంది. వీరిలో కోపం, కాళ్ళు చేతులలో వెచ్చదనం, కళ్ళు, చర్మం, కడుపు, ప్రేగులలో మండుతున్న భావన - పిత్తం సమతుల్యత తప్పితే సహజంగా కనిపిస్తాయి. తమకి తామే వేడిగా వుంటారు కనుక వీరు ఎండలో ఎక్కువసేపు వుండలేరు. చాలా తేలికగా వీరు వేడికి అలసట పొందుతారు. కష్టపడే పనులు చేయలేరు. బాగా కాంతిని చూడలేరు.
వీరు తేలికగా కోపానికి లొంగిపోతారు. వత్తిడి వల్ల తేలికగా కోపం వస్తుంది. చిరాకు, అసహనం, అత్యాశ, అన్నీ సవ్యంగా వుండాలనే తలంపు ముఖ్యంగా పిత్తం సమతుల్యత తప్పితే వీరిలో ఏర్పడే లక్షణాలు.
సాహసులు, నాయకత్వ లక్షణాలు గలవారు అయినా వీరిది పుల్లవిరుపు, ఘర్షణ మనస్తత్వం. ఇది ఇతరుల్ని దూరం చేస్తుంది.
వీరు క్లుప్తంగా, స్పష్టంగా మాట్లాడతారు. వీరు మంచి వక్తలు కాగలరు. వీరికి దృఢమైన భావాలుంటాయి. వాదన అంటే ఇష్టపడతారు. ఇతరుల్ని తీసేయడం, విమర్శనాత్మక సంభాషణ పిత్తం అసమతుల్యతను తెలియజేస్తాయి. అయితే ఇతర దోష తత్వాలు గలవారిలానే వీరికీ రెండు పార్శ్వాలున్నాయి. సమతుల్యతలో వుంటే, వీరు తియ్యగా, సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా వుంటారు. వీరికి సవాళ్ళంటే ఇష్టం. వాటిని గట్టిగా ఎదుర్కొంటారు. అయితే ఆ పని మధ్యస్థాయి భౌతిక శక్తితో మాత్రమే చెయ్యగలరు. వీరి సహనశీలత సాధారణ స్థాయిలోనే వుంటుంది. మంచి జీర్ణశక్తి వున్నా వుపయోగం వుండదు. మధ్య వయసులో "ఇదివరకూ ఏదైనా తినగలిగే వాణ్ని, ఇప్పుడు నా వల్ల కాదు." అంటుంటారు.
పిత్తతత్వం గలవారిలో జఠరాగ్ని బలంగా వుంటుంది. దీనివల్లే వీరికి బాగా ఆకలి దప్పులవుతాయి. అన్నిరకాల శరీరతత్వాల్లోనూ వీరే భోజనం మానడమే కాదు కనీసం ఆలస్యంగా తినడాన్ని కూడా తట్టుకోలేరు. దానివల్ల అసహనం, చిరాకు ఏర్పడతాయి. పిత్తం అధికంగా వుంటే గుండెల్లో మంట (ఇది కడుపులో పుండ్లు ఏర్పడ్డానికి దారితీయొచ్చు), ప్రేగుల్లో మంట, హెమరాయిడ్లు ఏర్పడతాయి. పట్టించుకోకపోతే, ప్రకోపించిన పిత్తం జీర్ణప్రక్రియను తీవ్రంగా బలహీనపరుస్తుంది. పిత్త చర్మం తేలికగా ఇబ్బందికి గురయి దద్దుర్లు, మంట, పొక్కులు ఏర్పడతాయి. పిత్తం వల్ల తెల్ల కనుగుడ్లు తేలికగా ఎర్రబడతాయి (దీని అసమతుల్యత దృష్టి మాంద్యాన్ని కలిగించే అవకాశం కూడా వుంది). ఈ తత్వం గలవారు గాఢంగా నిద్రపోగలరు కానీ ఓ రాత్రి సమయం వేడికి తాళలేక మేలుకుంటారు. వీరు దాదాపుగా ఎనిమిది గంటలు నిద్రపోతారు. సమతూకం తప్పితే, నిద్రలేమితో బాధపడతారు. ముఖ్యంగా పనిలో ముగినిపోయి, వంట్లోని శక్తి ఖర్చయిపోయినపుడు ఈ స్థితికి గురౌతారు.వీరు పరిమితమైన, శుద్ధమైన జీవన విధానాన్ని పాటించడం మంచిది. పరిశుద్ధమైన ఆహారం, నీరు, గాలి లోనికి స్వీకరించడాన్ని క్రమబద్ధీకరించే విషయంలో శరీరంలోని ప్రతికణమూ పిత్తదోషం మీద ఆధారపడుతుంది. పిత్తం సమతూకం తప్పితే అన్నిరకాల విషపదార్థాలు వేగంగా తమ ప్రభావం చూపుతాయి. ఈ కారణంగా పిత్తతత్వం గలవారు హానికరమైన ఆహారం, నీరు, గాలివల్చ తీవ్ర ఇబ్బందులకు గురౌతారు. మత్తు పానీయాలు, సిగరెట్లు, ముఖ్యంగా పగ, ద్వేషం, అసహనం, అసూయ వంటి విషభావాల వల్ల ఇబ్బందుల పాలవుతారు. ఆరోగ్యానికి ముఖ్య లక్షణాలైన మితం, పరిశుద్ధతలకు సంబంధించిన సహజజ్ఞానం మనం పిత్తదోషం వల్లే పొందుతాము.
కఫతత్వ శరీరం లక్షణాలు
1. దృఢంగా, బలంగా వుండే దేహ నిర్మాణం: గొప్ప శక్తి, సహనశీలత
2. నిలకడగల శక్తి, పనిలో నిదానం, సఖ్యత
3. ప్రశాంతత, విశ్రాంతి నిండిన వ్యక్తిత్వం: కోపం తేలికగా రాని గుణం
4. చల్లగా, నునుపుగా, గట్టిగా, పాలిపోయి వుండే జిడ్డు చర్మం
5. కొత్త విషయలు గ్రహించడంలో ఆలస్యం అయినా బలమైన జ్ఞాపకశక్తి
6. బాగా ఎక్కువసేపు గాఢనిద్రపోవడం
7. స్థూలకాయం పొందే ధోరణి
8. నిదానమైన అరుగుదల, తక్కువ ఆకలి
9. ఆదరం, సహనం, క్షమ కలిగి వుండడం
10. భాగం పంచుకోవడానికి అయిష్టత్త అలసత్వర కఫతత్వ ముఖ్యలక్షణం ప్రశాంతత. శరీరంలో నిర్మాణ సూత్రం అయిన కఫదోషం నెమ్మది, నిలకడలను కలుగజేస్తుంది. బరువుగల, బ్రాహ శరీరంలో ఇది భౌతిక శక్తిని, దమ్ము వనధుల్ని ఏర్పరుస్తుంది. ఖచ్చితంగా చక్కని ఆరోగ్యాన్ని కలిగి వుంటారు కనుక కఫతత్వం గలవార్ని ఆయుర్వేదం అదృష్టవంతులుగా 3. 'పేర్కొంటుంది. - ప్రపంచాన్ని వీరు నిర్మలంగా, ఆనందంగా, ప్రశాంతంగా వీక్షిస్తారు.
1. నిర్ణయం తీసుకోవడంలో రకరకాల మల్లగుల్లాలు పెడి బాగా సమయం తీసుకుంటారు
2. నిదానంగా మేల్కొని, చాలాసేపు అలాగే పడుకుని వుండి, లేవగానే కాఫీ తాగుతారు
3. ఉన్న స్థితితో సంతోషంగా వుండి, ఇతరుల పట్ల స్నేహభావం కలిగి దాన్ని కాపాడుకుంటారు.
4. వారి దృష్టితోనే గమనించి, ఇతరుల భావాలను గౌరవిస్తారు
5. తిండి విషయంలో మానసిక సౌఖ్యాన్ని కోరుకుంటారు
6. చక్కటి ప్రవర్తన, తడి కళ్ళు. అతి బరువున్నా ఎగురుతున్నట్లుండే నడక
అనేవి అధిక కఫతత్వానికి లక్షణాలు
భౌతికంగా, కఫదోషం శక్తిని, సహజ రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. చక్కటి దేహ నిర్మాణంతో పాటు కఫతత్వం గలవారికి భారీకాయం, భారీ పిరుదులు, భుజాలు వుంటాయి. వీరు తేలికగా బరువు పెరిగిపోతారు. తిండి వంక చూస్తే చాలు వీరి వళ్ళు బరువు పెరుగుతుంది. ఈ బరువు అంత తేలికగా తగ్గదు కనుక వీరికి స్థూలకాయం ఏర్పడుతుంది. మితమైన దేహం కలవారిలో కూడా ఈ తత్వం గలవారు వుంటారు. వాత-కఫతత్వం వంటి ద్విదోష తత్వంలో శరీరం సన్నగా వుండడం కూడా జరుగుతుంది. చల్లటి, నున్నటి, గట్టి, పాలిపోయిన జిడ్డు చర్మం కఫతత్వ వంటి తీరు. మృదువైన పెద్ద లేడి కళ్ళవంటి కళ్ళు కూడా దీని లక్షణాలలో ఒకటి. దేహం, మొఖాలలో కనిపించే ఎలాటి నిలకడ, ప్రశాంతత అయినా అంతర్గతంగా కఫ ఆధిక్యత వల్లే కలుగుతాయి. ఆడవారిలో కనిపించే వంపులు తిరిగిన వళ్ళు, శిల్పంలో కనిపించేలాటి సౌందర్యాలకు కారణం కఫతత్వమే.
కఫ దోషం నిదానమైంది. నిదానంగా తినేవారు (సాధారణంగా వీరిలో అరుగుదల నిదానంగా వుంటుంది), మెత్తగా, నిదానంగా మాట్లాడేవారు సాధారణంగా కఫతత్వం గలవారే అయి వుంటారు. ప్రశాంతత, ఆత్మతృప్తి కలిగి వుండే వీరికి కోపం తేలికగా రాదు, తమ చుట్టూ ప్రశాంతత వుండాలని వీరు కోరుకుంటారు. రుచి, వాసనలకు వీరు స్పందిస్తారు. ఆహారానికి వీరు బాగా ప్రాముఖ్యత నిస్తారు. వాస్తవ దృక్పథంగలవారు కనుక దైహిక అనుభూతుల మీద ఆధారపడతారు.
వీరిది నిలకడగల శక్తి. శారీరక కష్టం చేయడానికి ఇష్టపడతారు. అంచేత ఇతరులకన్నా ఎక్కువ దమ్ము కలిగి వుంటారు. అంత తేలికగా శారీరక అలసటకి గురికారు. డబ్బు, సంపదలు, శక్తి, మాటలు, తిండి, కొవ్వు దాదాపుగా అన్నిటినీ భద్రపరిచి, కాపాడుకుంటారు.
శరీరంలోని తేమ ధాతువులను ఈ దోషం అదుపు చేస్తుంది. దీని అసమతుల్యత జిగురు పారలు బయటపడేలా చేస్తుంది. ముక్కు దిబ్బడ, రొమ్ము పడిశం, ఎలెర్జీలు, ఉబ్బసం, కీళ్ళలో నొప్పులు (కీళ్ళనొప్పులు వాతానికి సంబంధించినవి) మొదలైన వాటితో బాధపడుతుంటారు వీరు. చలికాలం చివర, వసంత ఋతువులో ఈ బాధలు బాగా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.
స్వభావసిద్ధంగా కఫతత్వం గలవారు ఆదరం, సహనం, క్షమ లక్షణాలు కలిగినవారు. తల్లిలా వ్యవహరించడం వీరివల్లే అవుతుంది. సంక్షోభ సమయంలో వీరు అంత తేలికగా తొణకరు. తమ చుట్టూ వున్నవార్ని పట్టివుంచగలరు. వీరిలో అలసత్వం ప్రదర్శించే ధోరణి వుంటుంది. వత్తిడికి గురైతే, ఎంత చక్కటి సమతూకంలో వున్న కఫతత్వం గలవారైనా పనిచేయడం వాయిదా వేస్తుంటారు. వీరిలో వుండే ప్రతికూల ధోరణులు అత్యాశ, అతిఅనుబంధం. పాత వస్తువులు పారేయడానికి సైతం ఇష్టపడరు. సమతూకం తప్పితే, వీరు మొండిగా, మందబుద్ధిగలవారిగా, మందకొడిగా, బద్దకంగా తయారౌతారు.
వాతదోషంలానే కఫదోషం కూడా శీతల దోషమే. అయితే దీనిలో వాతంలా పొడిగా వుండకపోవడమనేది వుండదు. రక్త ప్రసరణ చక్కగా వుండడం వలన చేతులు, కాళ్ళు చల్లబడడం వల్ల ఇబ్బంది పడడం అనేది కఫతత్వం గలవారిలో జరగదు. వీరికి చల్లని, తేమ వాతావరణం పడదు. దానివల్ల మానసిక మందకొడితనానికి, కృంగుదలకి గురౌతారు. వీరు ఎక్కువసేపు గాఢంగా నిద్రపోతారు. రాత్రిపూట ఎనిమిది గంటలు మించి నిద్రిస్తారు. వీరు నిద్రలేమితో కాక అతినిద్రతో బాధపడతారు. ఉదయం బాగా ఆలస్యంగా చైతన్యం పొందినా రాత్రి బాగా పొద్దుపోయే వరకూ ఉత్సాహంగానే వుంటారు.
అందరిలోకీ వీరు నేర్చుకోవడంలో బాగా నిదానస్తులు, అయితే వీరికి చాలా చక్కటి జ్ఞాపకశక్తి వుంటుంది. వీరికి తమకి తెలిసిన విషయం మీద చక్కటి ఆధిపత్యం వుంటుంది. కొత్త సమాచారాన్ని నిదానంగా గ్రహిస్తారు. పద్ధతి ప్రకారం బుర్రకెక్కించుకుంటారు. సమతూకం తప్పితే మొద్దుగా, బుర్రలేనివారిలా మారతారు.
కఫతత్వంగలవారు చేయవలసిన ముఖ్యమైన పని పురోగమించడం. ఖాళీగా వుండడంవల్ల వీరిలోని స్థిరత్వం జడత్వంగా మారుతుంది. గతాన్ని గురించి ఆలోచించడం, మనుషులు, వస్తువులకు అతుక్కుని వుండడం, మార్పుని అంగీకరించలేకపోవడం అనేవాటికి వీరు దూరంగా వుండాలి. ఎంతోమంది ఈ తత్వంగలవారికి లేకపోయినప్పటికీ, ఉన్న కొద్దిమందీ తమలో వున్న ఉత్తేజాన్ని గుర్తుచేసుకుంటే అది వారిలో క్రొత్త జీవశక్తిని కలిగిస్తుంది. ఘన ఆహారం, శీతల ఆహారం, వ్యాయామం చేయకపోవడం, అతి తిండి, మళ్ళీమళ్ళీ అదే పని చేయడం వల్ల జీవశక్తి తగ్గుతుంది. ఆరోగ్యవంతుడి ముఖ్యలక్షణమైన అంతర్గత భద్రత, నిలకడ భావాన్ని మనలో కలిగించేది కఫదోషమే.