ఘంటసాల గీత
ఘంటసాలగురు,,,,ఒక సామాన్యుడు
ఈ ప్రపంచం ( భూమి) ఒక ధర్మ సత్రం వంటిది ఇక్కడ తినడానికి, త్రాగడానికి, బ్రతకడానికి అన్నీ వుంటాయి , అవి అన్నీ ఉచితమే, ఇక్కడ వున్నన్ని రోజులు ఎవరైనా,ఏదైనా పూర్తిగా, స్వేచ్ఛగా ఉపయోగించు కోవచ్చు, వాడుకోవచ్చు, తినొచ్చు, త్రాగ వచ్చు , అందువల్ల ఇక్కడ వున్నన్ని రోజులు ఆనందంగా , ప్రశాంతంగా, సులువుగా, స్వేచ్ఛగా, అనుభవించాలి,
నువ్వు వెళ్ళి పోయేటప్పుడు కర్మ ఫలితాన్ని తప్ప దేనినీ నీతో తీసుకు వెళ్ళ లేవు,
ఇదీ రహస్యం ఎందుకంటే చాలా మందికి ఇది తెలియదు తెలిసినా నమ్మరు
ఇది తెలియక చాలామంది చాలా దాచుకుని , దాని కోసం, కొట్లాడుకుంటూ, పోట్లాడుకుంటూ, ఆశపడుతూ,వెంట పడుతూ, లాక్కుంటూ, కోపాలు తెచ్చుకుంటూ, పట్టుదలతో , మనశ్శాంతి పోగొట్టుకుంటూ , ఇదంతానాదే అనుకుని. అవేవీ దక్కక ఈ నాలుగు నావే అనుకుని, తర్వాత ఇదొక్కటీ వుంటే చాలనుకుని చివరికి ఏమీ తనతో తీసుకు వెళ్ళ లేక ఇక్కడే వదిలేసి వెళ్ళి పోతారు, ఇక్కడ ఎవరికైనా ఒక్కటే నియమం,
ఇచ్చి పుచ్చుకోవడం
ఇక్కడ ఎవరైనా సరే పని చేసి ఎవరికి వారు సంపాదించుకోవాలి , అనుభవించాలనే, నియమం మాత్రమే వుంటుంది. జంతువులు దానిని పాటిస్తాయి, కానీ అవి బలమైనవి బలహీనమైన దాని చేతిలో వున్నది లాక్కుంటుంది, లేదా చంపేసి తినేస్తుంది. సృష్టించలేని దానిని చంపటం తప్పుగా మనిషి భావించాడు , ఒకరి స్వేచ్ఛను హరించడం, మానసికంగా, శారీరకంగా, బాధించడం ధర్మం కాదని గ్రహించి, కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకుని ఆచరిస్తున్నారు. ఆచరిస్తున్న వారు ఆనందంగా ఉన్నారు , నేను ఆచరిస్తున్నాను, ఆరోగ్యంగా, ఆనందంగా వున్నాను ,ఇదీ జీవితం, ఇదే జీవితం, ఇంతే ,,,,,,,ఇది బాగా అర్ధం చేసుకోవాలి,,,,,,,
ఇంకా దీనిలో మీకేమైనా అనుమానాలు వస్తే 9490478707 కి మెసేజ్ పెట్టండి, తెలిస్తేనే చెబుతాను, లేదంటే తెలుసుకుని చెబుతాను.
దేవాలయాలలో శృంగార భంగిమల శిల్పాలు ఎందుకు
రెండు శరీరాలు కామంతో, కోరికతో, కలిసి శృంగారం చేస్తే, అంతిమంగా కలిగే ఆనందం మోక్షానికి ప్రతిబింబం, అది ఒక్క క్షణం మాత్రమే వుంటుంది, దాని కోసం మనిషి పడి చచ్చిపోతాడు, యుద్దాలు చేస్తాడు, బలవంతం చేస్తాడు, జన్మనిచ్చిన తల్లి తండ్రులను కూడా వదిలేస్తాడు, కానీ,,,,,,,,
ఆత్మ ఆత్మతో కలవడమే నిజమైన మోక్షం,
అది శాశ్వత ఆనందం, మోక్షానికి ప్రతిబింబమైన శృంగారం వల్ల శరీరం, శరీరం కలిస్తే కలిగే ఆనందమే నీకు అంత సుఖాన్ని ఇస్తే ఆత్మ ఆత్మతో కలవడం వల్ల వచ్చే శాశ్వత ఆనందం ఇంకా ఎన్ని రెట్లు,ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది, దాని కోసమే ప్రయత్నించాలి, సాధన చేయాలి, అది తెలుసుకోవడానికే దేవాలయాలలో శృంగార భంగిమల శిల్పాలు పెట్టారు, అది బూతు కాదు మోక్షానికి సంబంధించిన సమాచారం ఇచ్చే జ్ఞాన శిల్పం. ఇది జ్ఞానం , దీనిని అనుభవంలో తెలుసుకోవడం విజ్ఞానం , ఇక్కడ నేను సమాచారం మాత్రమే ఇవ్వ గలను, అనుభవాన్ని ఇవ్వలేను, దానిని మీరు అనుభవంలో సాధన చేసి సాధించాలి, అనుభవించాలి, ఆనందంలో మునిగి తేలాలి,
నాకు ఏ ప్రశ్నలు లేవు, ఎందుకంటే ఈ ప్రపంచం వెనుక ఒక నిరాకార, నిర్గుణ, అధ్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని మనం మన దారికి సహకరించాలని అడగ వచ్చును, అవే విగ్రహారాధన, పూజలు,జపాలు, హోమాల పరమార్థం, ఆ శక్తి ఉందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా నేను ఋజువు పరుచుకున్నాను, మీరు ఎలా ఋజువు చేసుకోవాలి ముందు ముందు తెలియజేస్తాను.దాని కనుసన్నల్లో నే ఈ ప్రపంచం నడుస్తోంది, దానిలో ఒక అంశ నేను , నా ప్రతి కణం లోనూ అది శక్తి రూపంలో వుండి ఈ శరీరాన్ని నడిపిస్తోంది, ఆ శక్తి ఈ శరీరం నుంచి వెళ్లిన రోజున ఈ శరీరం నిర్జీవమై పోతుంది , దానిని కాదని నేను చేయకలిగింది ఏమీ లేదు, అలాగని చేతులు కట్టుకుని కూర్చోకూడదు పని చేయాలి కోరుకోవాలి ప్రయత్నించాలి, దక్కినా దక్కక పోయినా ఒకేలా వుండాలి, సాధన చేయాలి, ఆ శక్తి నిర్ణయం ప్రకారమే నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, నా నుండి ఏది తీసేయాలి ప్రతిది నేను పుట్టిన సమయం తోనే నిర్ణయిం చేసే వుంది ఎలాగంటే ఒక నువ్వు గింజ నుండి ఏ మొక్క రావాలి ఎలాంటి పూలు, కాయలు, గింజలు, రావాలి, ఏ కాలంలో రావాలి ఎన్ని పూతలు రావాలి ప్రతిదీ ఒక సిస్టం ప్రకారమే జరుగుతుంది, ఇది నాకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా వేల జాతక చక్రాలు చూసిన అనుభవంతో అవగతమైంది, చేయాలనుకున్నది ప్రయత్నించడం మాత్రమే నేను చేయకలిగింది, ఫలితాలు నాపై ఎలాంటి ప్రభావం చూపించవు, ఇది తెలిసాక నాకు ఇంకా తెలుసుకోవాల్సింది ఏదీ లేదని తెలిసింది , నా చేతిలో వున్న దానిని అనుభవిస్తూ కాలంతో ప్రయాణించడమే జీవితం. ఇది చాలా తేలిక జీవన విధానం సులువైనది , మీరు కూడా అలా వుండాలన్నదే నా సంకల్పం. అలా వుండడం వల్ల నేను బీపీ,షుగర్, లేకుండా రుమటాయిడ్ ఆర్ద్రైటిస్ పాజిటివ్ వున్నా కీళ్ళ నొప్పులు లేకుండా, నిత్యం ఎవరి ఆలోచనలలో నా మనసు ఇరుక్కు పోకుండా వుండ కలుగుతున్నాను. మీరు కూడా ఎవరి ఆలోచనలలో ఇరుక్కు పోకూడదు నాతో సహా ఎవరినీ గ్రుడ్డిగా నమ్మకండి పరిశోధించి తెలుసుకోవాలి, ఇది నేను ఎవరికీ నిరూపించలేను, ఇది ఎవరికి వారు పరిశోధించి తెలుసుకోవాలి, నేను కేవలం సమాచారం మాత్రమే ఇస్తున్నాను, కోరిన వారికి జ్యోతిష్య శాస్త్ర సహకారం ఇవ్వగలను.
ఒక సామాన్య మనిషి ఒక పసి పిల్లాడిలా చాలా సులువుగా, ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా వుండడానికి ఏం చేయాలో చాలా సులభమైన, మార్గాలను ఇక్కడ తెలియజేస్తున్నాను, ప్రతి పదాన్ని కేవలం ఒక సమాచారంగా తీసుకొని స్వయంగా పరిశీలించి, పరిశోధించి,అర్థం చేసుకుని ఆచరించాలి,
మీకు ఒక ఎక్సర్సైజు ఇస్తాను. అది మీ మెదడు లోని అనవసరమైన విషయాల నుండి మిమ్మల్ని విడుదల చేస్తుంది. దానిని స్థిమితంగా పూర్తి చేయండి.
ఒక కాగితం తీసుకుని దాని మీద ఒక వరుస క్రమంలో ఏది లేకపోతే నువ్వు ఆనందంగా వుండలేవో అవి అన్నీ వరుసగా వ్రాయి. ఇప్పుడు స్థిమితంగా ఒక్కొక్క దాని గురించి నిదానముగా ఆలోచించు, అది నీకు ఎందుకు అంత అవుసరం, ఈ భూమి మీద నుండి అది మాయమై. పోతే ఏమవుతుంది, ఆలోచించండి, నిజానికి ఏమీ కాదు, కానీ నీ మెదడు అంత సులువుగా ఒప్పుకోదు , కానీ ప్రయత్నం చెయ్యి అది లేకపోయినా నువ్వు బ్రతక గలను అని నీకు అనిపిస్తే దాని ద్వారా వచ్చే సమస్యలు మరిచిపో, సాధన చెయ్యి, దానిని వాడుకో మనస్ఫూర్తిగా వాడుకో , దాని వల్ల వచ్చే ఆనందం మాత్రమే అనుభవించాలి, అంతే తప్ప అది లేదని అది పాడై పోయిందని , దూరమైందని బాధ పడడం మానేయాలి. ఇలా నిన్ను బాధ పెట్టే ప్రతి విషయాన్ని మరిచిపోయేందుకు ప్రయత్నం చేయండి. దీనిని బాగా సాధన చేయండి. అలా ఒక వస్తువు లేదా మనిషి దాని గురించిన బాధలు వుండకూడదు, ఆనందం మాత్రమే వుండాలి, ఉదాహరణకు ఒక కారు కొనుక్కున్నావు, నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కున్నావు కనుక దాని కీ నీ చేతికి రాగానే అది నీదిగా నీ మెదడు భావిస్తుంది, ఇదే మాయ , ఆ మాయలో నువ్వు ఇరుక్కున్నావో , సమస్యలు మొదలవుతాయి ఆ కారు మీద చిన్న గీత పడినా, నీకు బాధ అనిపిస్తుంది, దేని గురించి బాధ పడకు అది నీది కాదు ప్రస్తుతం నీ చేతిలో వుంది అంతే, ఇదే నిజం దీనిని బాగా అర్థం చేసుకోవాలి ప్రస్తుతం నీ చేతిలో ఉన్నది మాత్రమే నీది, నీ చేతిలో ఉన్నంత కాలం నీది, ఏదైనా ఇంతే, కనుక నీ చేతిలో వున్నంత వరకు మనస్ఫూర్తిగా వాడుకో నిజానికి ఈ భూమి మీద నీ దంటూ ఏదీ లేదు ఇది అసలు నిజం, ఈ నిజం ఎప్పుడూ స్పురణలో వుండాలి, ఈ నిజాన్ని గ్రహించిన రోజున ఆ కారైనా , మరేదైనా, ఏ వస్తువు అయినా అది నీ దగ్గర వున్నన్ని రోజులు మనస్ఫూర్తిగా వాడుకుంటావు, దాని వల్ల నీకు ఏ సమస్యలు, బాధలు, వుండవు, ఎప్పుడు ఏ రిపేరు వచ్చినా బాగు చేయిస్తావు వాడుకుంటావు, అవుసరం లేదనుకుంటే అమ్మేస్తావు, మరి మనిషి విషయంలో ఎలా వుండాలి, వస్తువైనా, మనిషైనా నిజం ఇదే, ఏదీ నీది కాదు, నీదంటూ ఏదీ లేదు, కాకపోతే ప్రకృతిలో బలమైనది బలహీనమైన దాని చేతిలో వున్నది లాక్కుంటుంది లేదా చంపేసి తినేస్తుంది, మనిషి తనకు వున్న జ్ఞానం వల్ల ఎదుటి దానిని బాధ పెట్టడం సరికాదని తెలుసుకుని ఏది కావాలన్నా ఎవరికి వారు కష్టపడాలి సంపాదించుకున్న దానిని అనుభవించాలి, అన్న నియమం పెట్టాడు, అందరూ పాటిస్తున్నారు అంతే, అంత వరకే పాటించాలి, ఆయా వస్తువుల లోనూ, మనుషులలోనూ నీ మనసు ఇరుక్కు పోకూడదు, ఏ మనిషైనా, ఏబంధం అయినా ప్రాణం వున్నంత వరకే, ఇది తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి, అలాగని విచ్చలవిడితనం రాకూడదు, మన వల్ల ఎవరికీ బాధ రాకూడదు, ఎవరి స్వేచ్ఛ కూ మనం అడ్డం కాకూడదు, ఇదీ నియమం, ఎవరి ఆలోచనలతో మనం ఇరుక్కు పోకూడదు, మన ఆలోచనలతో ఎవరిని ఇరికించ కూడదు అది తప్పు,
త్వరలో మరిన్ని వివరాలు
ఇలా ప్రతి రోజూ వీలైనంత వరకు అప్డేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను, మీకు ఉపయోగపడే అనేక విషయాలు మీ ముందుకు తీసుకు వస్తాను, . అనవసరమైన విషయాలను, మనుషులను మరిచి పోవాలి.
నీ మెదడులో నీ చుట్టూ వున్న వారు రకరకాల ఆలోచనలతో, నింపేసారు, వాటిలో కొన్ని నమ్మకాలుగా, నిజాలుగా,నియమాలుగా, స్థిరపడిపోయాయి, అవి నీ మీద చాలా ప్రభావం చూపుతాయి , అదే నిజం, అలాగే నడవాలని డిమాండ్ చేస్తాయి, ఇక నుంచి ప్రతి సంధర్భంలోనూ అలాగే ఎందుకు చేయాలి, ఇంకా వేరే విధంగా ఎందుకు చేయకూడదు, ఒకసారి ఆలోచించాలి, ప్రశాంతతను, సంతోషాన్ని కలిగించే మరో సులువైన మార్గం కనిపెట్టి ఆచరించి చూడండి, ప్రకటించండి,
ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువు, ఏ మనిషి,నీతో కలసి రాలేదు, ( పుట్ట లేదు) , నీతో కలసి వెళ్లి పోదు, ( చనిపోదు ) ,
కోరికలను అణచి పెట్టకూడదు ఇంకా పెరుగుతాయి మూలం నుంచి తీసేయాలి అవకాశం వున్నా కూడని పని చేయకుండా వుండాలి అదే సాధన, ధ్యానం ఎన్ని సంవత్సరాలు అయినా చెయ్యి తప్పు లేదు జ్ఞానం మాత్రం తక్కువ సమయంలో రావాలి సంవత్సరాలు అవుసరం లేదు,వ్యాపారాన్ని వ్యాపారంగా చేస్తూనే ఆనందంగా వుండు, వంద ఎకరాలు వున్నా దానిని పూర్తిగా అనుభవించ లేవు వంద గజాలు వున్న వాడు పూర్తిగా అనుభవిస్తాడు, దేనిలోనూ తాదాత్మ్యం చెందకు అవసరానికి వాడుకుని వస్తువులు వదిలేస్తే సమస్యలు ఉదయించవు మనసులో ని ఆలోచనల సమాహారమే నేను ఆలోచనలు లేకపోతే నేను లేదు, ప్రకృతి లో ఎవరికి ఎవరు ప్రోత్సాహం, ప్రేరణ ఇవ్వనవసరం లేదు నీకు నువ్వే ఎదురుగాలి అదే అసలైన నువ్వు, స్ధిరంగా వున్న మనసు శక్తి ని ఆకర్షిస్తుంది, నీ శరీరం నటించ వచ్చు కాని మనసు దాకా అది రాకూడదు, అదే జ్ఞానం, దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి నీలో వున్న చెత్తను గుడి బయట వదిలేసి నిర్మలమైన మనసుతో ఇంటికి వస్తావు, మెదఢు, మనసు ఆడుకునే ఆట కల అక్కడ నువ్వు వుండవు నువ్వు వస్తే కల చెదిరి పోతుంది, తిట్టే వాడినీ, కాళ్ళు మొక్కే వాడిని సమానంగా చూస్తూ ఏ స్పందనా లేకపోవడం జ్ణానోదయం , ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకు , మనుషులతో ఎలా వుండాలి ముందు తెలుసుకో, అతిగా ఏదీ చేయకు లేదా ఏమీ చేయకుండా వుండకూ సమాన స్థాయి లో వుండు గాలిని నువ్వు పీల్చుకోవడం లేదు అదే వస్తుంది పోతుంది ఆస్తమా వున్న వాడు గాలిని పీలుస్తూ వుంటాడు, ఏ పని అయినా చేయగా చేయగా సులభం కావాలి కదా మరి జీవితం కూడా అంతే, దానంతట అది జరిగేది ఏదీ ఆగదు ఊపిరి ఆగదు దానితో సమస్య కూడా వుండదు నువ్వు ప్రారంభించినది ఏదో ఒక రోజు ఆగిపోతుంది, నువ్వు కోల్పోయినది లేదు, ప్రత్యేకంగా పొందేదీ లేదు, నువ్వు తృప్తి గానే వున్నా వు నీదంటూ ఏదీ లేదు, కోల్పేయేదీ లేదు, శరీరం నిరంతరం చేయాల్సిన పనిని నిరంతరం చేస్తూ, సమయం ప్రకారం చేయాల్సిన విధులను క్రమ శిక్షణతో చేస్తూ తనకు ఉపయోగపడేది , ఏం కావాలో , ఎంత కావాలో అది మాత్రమే తీసుకుని మిగతాది బయటకు పంపిస్తుంది మెదడు చేయాల్సినది కూడా ఇదే , హఠాత్తుగా ఏది ఎదురైనా, ఏది లభించినా, మెదడుకు అయోమయంగా వుంటుంది సమాధానం వినగానే సమస్య మాయం అవదు దానిని శారీరకంగా అనుభవించిన తర్వాతే మాయం అవుతుంది, అన్నం పెడితేనే ఆకలి మాయం అవుతుంది చెట్టు వేళ్ళకు నీరు పోస్తే ఆకులకు ప్రత్యేకంగా నీరు ఇవ్వనవుసరం లేదు ఈ భూమి చాలా మంది పిచ్చోళ్ళని చూసింది అందులో నువ్వు లేకపోవడం అదృష్టం
నీ శరీరం ఏం చేస్తుందో దానిని నీ మనసుకు కూడా అప్లై చేయ కలిగితే నీ అంత సంతోషంగా ఎవరూ ఉండరు, అవుసరమైనవి మాత్రమే వుంచుకొని అవసరం లేనివి ఎప్పటికప్పుడు బయటకు పంపేయాలి,
నీ మాట, నీ నడక, నీ పనులు, నీ శ్రద్ధ, నీ ప్రేమ ఇవన్నీ ఎవరిని ఆకర్షించడాని కోసం, ముందు నీకోసం నువ్వు బతకాలి, నీకోసం నువ్వు నిజాయితీగా పని చెయ్యాలి,
ఒక మనిషి నిచెంప మీద కొట్టడం వల్ల నీ ఇగో తృప్తి పడవచ్చు కానీ నీ చేతికి కూడా దెబ్బ తగిలిందని గర్తించు,ఎవరితో ను వాదించకు ముగించి ముందుకు వెళ్ళిపోవాలి మనుషులను సమస్యలను మోయకు కావాలనుకుంటే కాసేపు ఎత్తుకుని వదిలేయ్,దారి తెలియనప్పుడు, నిర్ధారణ లేనప్పుడు టెన్షన్ మొదలవుతుంది దేనినీ ఆపకు,,,,, దాటు, అంతే, ఆనందం కోసం అన్వేషణ చేయకు, ఆనందం లోనే వున్నావని తెలుసుకో, ఒకటి నీది కాదని తెలియాలంటే అజ్ఞానికి అది లేని రోజు మాత్రమే తెలుస్తుంది, కానీ జ్ఞానికి అది ఎదురుగా వున్న ప్పుడే తెలుసుకుని నిర్మలంగా, ప్రశాంతంగా, జీవిస్తాడు,
ఎవరి కొరకు,దేని కొరకు దుఃఖించని వాడు పండితుడు , రాయిని, గాజునీ ఒకేలా చూడడం సమ దృష్టి, ఒకే భావన కలిగి వుండడం సమ భావన, దేనిని ఎలా వాడాలో అలాగే వాడడం చైతన్యం, ఇదే జీవితం, ఎవరితో అయినా,ఏ సందర్భంలో అయినా యుద్ధం చేయకండి, కలిసి పని చేయండి అంతే ఇదే ప్రశాంత జీవన సూత్రం,
నీ జీవితంలో నీ శరీరంలో భాగంగా వున్న దాని గురించి నీకు జెలసీ వుండదు,
ఒక్క సెల్ వుంటే దాన్ని పగుల కొడితే బాధ వస్తుంది, వంద సెల్ఫోన్స్ ఉన్నపుడు ఒకటి పగుల కొడితే బాధ వుండదు, నాది అనేది మనసులో తగిలించడం వల్ల బాధ మొదలైంది ఆనందం మసక బారింది ఎన్ని కోట్లు సంపాదిస్తే ఆనందంగా వుంటుంది అనేదానికి ఆధారం లేదు ఆనందంగా వుండడం అంటే ఆనందం తెచ్చుకోవడం కాదు నీలోనే వున్న ఆనందాన్ని కనిపెట్టడం
డిప్రెషన్ లో నుండి బయటకు రావాలంటే ఒక క్రొత్త, ఇష్టమైన పనిచేయడం మార్గం ఎదుటి వారు మాట్లాడుతుంటే శ్రద్ధగా వినాలి ముక్కులో వేలెట్టి కెలుక్కోవడం, కాళ్ళు బార్లా జాపుకుని కూర్చోవడం, ఆకాశం వంక వెర్రి చూపులు చూడడం చేయకూడదు, ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ చంకలో నుంచి మధ్య లో దూరి వెధవ సలహాలు ఇవ్వకూడదు ఎవరెవరు ఏపని చేయాలో నిర్ణయించుకుని దానిని పాటించాలి ఒకడి మీద వచ్చిన కోపం ఇంకొకరి మీద చూపించడం తప్పు , నోరు ఉంది కదా అని ఏది పడితే అది వాగకూడదు ఎదుటి వారి నుండి నువ్వు ఏది కోరుకుంటావో అది నువ్వు ముందుగా ఇవ్వడం నేర్చుకో నీ చిరునవ్వు నీకు ఎదుటి వారికి కూడా బలాన్ని ఇస్తుంది లేని దానిని కోరుకుంటే సాధన కావాలి ఉన్న దానిని చూడడానికి గుర్తించడానికి సాధన అవుసరం లేదు ఐస్ క్రీం చీకుతూ తినాలి బఠాణీలు నములుతూ తినాలి ఇది తెలియని వాడు అన్నిటినీ చీకుతాడు లేదా నములుతాడు,