ఇంటికి గుమ్మడికాయ కట్టే విధానం, మంత్రం ,
గుమ్మడికాయలు రెండు రకములు రాచ గుమ్మడి లేదా మంచి గుమ్మడి యందు చరకి దేవత, బూడిద గుమ్మడి యందు విధారి దేవత నివసించి ఉందురు. ఈ దేవతలు యజమాని యొక్క కష్ట నష్టములను తొలగించు స్వభావము కలవారు. గ్రహస్వరూపముతో కూడిన పిశాచాదులను తొలగించి రక్షించువారు.అందుచే గృహారంభమునందు గృహప్రవేశమునందు పసుపు కుంకుమలతో కూడిన మంచి గుమ్మడి అనగా రాచ గుమ్మడిని పగుల గొట్టుట.. బూడిద గుమ్మడిని ద్వారమునకు కట్టుట ఆచారమై ఉన్నది. గుమ్మడికాయ కొట్టినప్పుడు లేదా కట్టేటప్పుడు ఈ మంత్రమును స్మరణ చేయవలెను...
హే కుష్మాండ దేవతా.. ఇయం గృహే శాకిన్యాది దేవాః. పరయంత్ర పరతంత్రాది సర్వ దోషాన్ నివృత్తయ నివృత్తయ గృహే సర్వ కార్యాధీన్ రక్ష రక్ష హూం ఫట్ స్వాహా... అని మూడుమార్లు చదవవలెను.