నువ్వు ఎందుకు పుట్టావు ముందు అది తెలియాలి, అప్పుడే నువ్వు ఏంచేయాలి, ఎలా నీ జీవితాన్ని ముందుకు నడిపించాలి, తెలుస్తుంది, అదెలా తెలుసుకోవాలి, ఎలా తెలుస్తుంది,
ఒక మామిడి చెట్టు మామిడి కాయలు, మామిడి పండ్లు, మామిడి కొమ్మలు, ఇవ్వడానికి పుట్టింది, అదే దాని జీవితం, అలాగే ప్రతి మనిషికి ఏదో ఒకటి ఎక్కువగా ఇస్తుంది అతని జీవితం, అది ఏమిటో నీకు నువ్వే తెలుసుకోవాలి, అప్పుడే నువ్వు తృప్తిగా, మనశ్శాంతిగా , ఆనందంగా వుంటావు.
నీ జీవితం నీకు ప్రత్యేకంగా ఏమి ఇచ్చింది ,అది, జ్ఞానం కావచ్చు, దానిని అందరికీ ఇవ్వచ్చు, శారీరక బలం కావచ్చు మరొకరికి చేయూతనిచ్చి నిలబెట్టవచ్చు, ధనం కావచ్చు, నీకు కావాల్సింది వుంచుకుని ఇతరులకు దానంగా ఇవ్వవచ్చు, లేదా పది మందికి ఉపాధి అవకాశం ఇవ్వచ్చు, ఒక కళ కావచ్చు అందరికీ ప్రేరణ ఇవ్వవచ్చు, సంతోషం , వినోదం,ఇవ్వవచ్చు,
నా మటుకు నాకు ఆధ్యాత్మిక చింతన, జ్ఞానం, ఇచ్చింది,నా జీవితం, దానితో అందరికీ ధైర్యాన్ని, మానసిక బలాన్ని ఇస్తున్నాను,నాకు ఆర్ధిక సమస్యలు, ఇచ్చింది, ధనాన్ని ఎలా పొదుపుగా వాడాలో తెలుసుకున్నాను , అదే అందరికీ చెబుతున్నాను, బీపీ, షుగర్ రాని ఆరోగ్యం గురించి తెలుసుకున్నాను, అదే అందరికీ చెబుతున్నాను, నిత్యం స్ధితప్రజ్ణతగా వుంటున్నాను, మీరు కూడా ఆలోచన చేయండి, ఆచరణలో వుంచండి,
మీకేమైనా సమస్యలు వున్నాయా వాటినుండి ఎలా బైట పడాలో ఆలోచించండి, ఆ సమస్యలతో సతమతమవుతున్న వారికో మంచి సలహా ఇవ్వండి,
త్వరలో మరిన్ని విషయాలను మీ ముందు వుంచుతాను,