Labels,

1aaఘంటసాల గీత (1) 1ab108శుక్రవారములువేంకటేశ్వరునిపాదములకుఅభిషేకం (1) 1abనీఆనందంఎక్కడవుందోతెలుసా (1) 1abసులువుగాఆనందంగాబ్రతకడంఎలా (1) 1aవివాహానికిసరిపడునక్షత్రములు (1) 1aశిశువుపుట్టిననక్షత్రముమంచిదాకాదాదోషాలువున్నాయాఇక్కడచూడండి (1) 1aసంతోషం (1) 1bనాపేరునిబట్టినక్షత్రము (1) 1cనవగ్రహరెమిడీస్ (1) 1m100tables (1) 1m100tablesinsinglesheet (1) 1m100tableswithname (1) 1m1to100tablesfor20 (1) 30days (1) 5artbrushes (1) 6qus (1) 9Bhagavadgita (1) 9bottons (1) agecalculatorinyearsmonths (1) ashtotharalu (1) Business (1) Dealoftheday (1) differentappsinthispage (1) differentbrushes (1) DynamicStoryGenerator (1) Flippingcard (1) ghantasalagita (1) Govinda (1) Lawofatraction (1) lovestorygenerator (1) Money (1) MoneyBusinessGovernmentjob (1) muggulu (1) newstylishbuttons (1) omnamahshivaya (1) Onemovement (1) peacockcards (1) super app (1) Superbrush (1) superPasswordGenerator (1) Varietycard (1) vasthu (1) vasthu planer (1) vastu tips (1) Weddinginvitationgenaretor (1) WeddingInvitationGenerator (1) Whatisthis (1) wow app (1) yourrasi (1) అధ్భుతమైనరెమిడీమీకోసం (1) ఆయుర్వేదం (1) ఇక్కడమీపేరునిటైపుచేసిమీలక్కీనెంబర్స్ (1) ఇలావెరైటీగామెసేజ్పంపించండిసర్ప్రైజ్అవుతారు (1) ఏపూజఅయినాపాటించాల్సిననియమాలు (1) కాశీయాత్రవిధివిధానం (1) గ్రామదేవతలవివరాలు (1) తెలుసుకోండి (1) దేవాలయనియమాలు (1) ధనలక్ష్మీప్రాప్తికి (1) ధనాకర్షణ (1) నక్షత్రాలు (1) నవగ్రహపూజలు (1) నాకుబీపీషుగరులేదుఎందుకంటే (1) నువ్వుఎవరుఇక్కడసులువుగాతెలుసుకో (1) నేనుచేస్తున్నతప్పులుఏమిటి (1) పిల్లలకునేర్పాల్సినధ్యానశ్లోకములు (1) పిల్లలకునేర్పించండి (1) బూడిదగుమ్మడికాయకట్టేవిధానం (1) భార్యాభర్తలుప్రశాంతజీవనసూత్రాలు (1) మనసుబుద్ధిఆత్మఎక్కడవుంటాయి (1) మీగోత్రనామాలతోకాశీమహాక్షేత్రంలోమహాశివరాత్రిఅభిషేకం (1) మీనక్షత్రానికిడబ్బులుతెచ్చే3నక్షత్రాలు (1) మీరుమగపెళ్ళివారాఆడపెళ్ళివారాఇక్కడతెలుసుకోండి (1) మీలక్కీనంబర్స్ తెలుసుకోండి (1) రాశిఏదివస్తుంది (1) విధులు (1) వెరైటీక్విజ్ (1) వెరైటీమెసేజ్ (1) శిశువుపుట్టినసమయాన్నిఎలానిర్ణయించాలి. (1) సందేహాలుసమాధానాలు (1) సప్తవ్యసనాలుఅంటేఏమిటి? (1)

14 Feb 2024

 జుట్టు ఎక్కువగా వూడిపోతున్నా పేలు వున్నా పుదీనా ఆకుని పేస్టు చేసి తలకు రాత్రి పూట పట్టించి తెల్లవారి లేచాక కడిగేసుకుంటుంటే మార్పు వస్తుంది 

ధనియాలను ;జీలకర్రను సమానంగా తీసుకుని కొంచం ఉప్పును కలిపి మజ్జిగలో కలుపుకుని రెండు పూటలు వాడుతుంటే మంచి జీర్ణశక్తితో
ఆరోగ్యం బాగుంటుంది
మోకాలి నొప్పులకు బియ్యం కడిగిన నీళ్ళతో ఉమ్మెత్త ఆకుని మెత్తగా నూరి రాత్రి పూట కట్టి ఉదయం కడిగితే నిదానిస్తుంది  
చర్మం మీద వచ్చు అనేక సమస్యలకు నిమ్మరసం బాగా పనిచేస్తుంది. నల్ల 
మచ్చలకు పుండ్లకు పైన రాసి చూడండి మంచిఫలితం వుంటుంది 


వేసవికాలం పెద్దవారు చిన్నవారు కూడా తప్పని సరిగా గోళ్ళు తీసు కోవాలి 

లేక పోతే చెమటకి దురద వచ్చి  గోక్కోవడం వల్ల మరిన్ని సమస్యలు వచ్చే 
ఆవకాశం వుంది 

వేసవికాలం చాలామందికి మోషన్ గట్టిగా అయ్యే ఆవకాశం వుంది. ఇందుకు నల్ల నువ్వులు రాత్రి పూట తిని చల్లని నీటిని త్రాగడం వల్ల మంచిఫలితాలను చూడవచ్చును  


చర్మ సమస్యలకు ఆవు మజ్జిగను పులిసినది రాసుకున్నా మంచి మార్పును చూడవచ్చును  

పుచ్చకాయలోని సిట్రులిన్ అనే ఎమినో యాసిడ్లు మగవారికి సహజ వయాగ్రాలా పనిజేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు వుపయోగించి 
ఫలితం చూడండి

సోంపును బెల్లాన్ని కలిపి క్రమం తప్పక వాడితే నెలసరి క్రమంగా అవుతుంది      
మిరియాల పొడికి కొంచం జీలకర్ర . మజ్జిగ . ఉప్పు  కలిపి పండ్లు తోముకుని 


చూడండి తెల్లగా మేరుస్తాయి   


సజ్జలను ఆహారంగా వాడు తుంటే మొలలబాధ వుండదు మంచి ఆహారంకూడా 

సోంపును రెండు పూటలూ క్రమం తప్పకుండా వాడితే దగ్గు ఆయాసాల్లో 
మంచి ఉపశమనం కలుగుతుంది 

సోంపును ఎండించిన పుదీనా ఆకు చూర్ణం సమానంగా కలిపి రెండు పూటలు చిన్న పిల్లలకు చిన్న మోతాదులో తినిపిస్తూవుంటే జీర్ణశక్తి బాగుంటుంది 

రాత్రిళ్ళు సరిగా  నిద్ర పట్టని వారు వేడి వేడి పాలను త్రాగితే మంచి నిద్ర వచ్చే 
అవకాశం వుంది 


మీ సమస్య ఏదయినా నాకు తెలియజేస్తే 
స్వయంగా వాడి చూసి మంచి ఫలితాలను పొందినవారి నుండి సేకరించినవి 
అయిదు వందలకు పైగా చిట్కాలనుండి మీకు సరిపోవు మంచి చిట్కాను 
అందిస్తాను 
ఫోన్ ;9490478707 
[vusiri]పెద్ద ఉసిరి కాయను మీరు ఎవిధంగానయినా అంటే పచ్చిదికానీ ఎండుదికానీ ప్రతి రోజూ కొద్ది మోతాదుగా లోపలికి వాడు తుంటే చాలా సమస్యలకు సమాధానం చెబుతుంది ;
శోభి మచ్చలకు కర్పూరాన్ని తులసిఆకు రసంతో  నూరి పైకి రాస్తూ 3తులసి దళాలను లోపలికి తీసుకుంటుంటే త్వరగానే మంచి ఫలితాలను  చూస్తారు;  

కోపం వల్ల నష్టాలు

  కోపం వల్ల 

జీర్ణశక్తి తగ్గిపోతుంది

రక్తపోటు పెరుగుతుంది, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి

హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది

తలనొప్పి రావచ్చు, నిద్ర సరిగా పట్టదు,

క్రోధమువలన సమ్మోహనము అనగా మత్తు లాంటి స్థితి, జనించును .అనగా తనని తాను మరచిపోవును, అందువలన మనసు,బుద్ది అదుపులో వుండవు, ప్రశాంతత వుండదు. జ్ఞాపకశక్తి నశించును, నీరసం,అశాంతిగా వుంటుంది, ఆనందంగా వుండలేరు, దాని వలన బుద్ధి చెడును, దాని వలన మనిషి పతనమైపోవును, కావున విజ్ఞుడైన వాడు కోపమును దరికి రానీయక ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండవలెను. ప్రతిరోజు మెడిటేషన్ చేసినప్పుడు మనం మానసికంగా భావోద్వేగాల పరంగా దృఢంగా మారుతాము.  దానివల్ల మన ఓపిక ఓర్పు పెరిగి మనకి కోపం రావడం తగ్గుతుంది.

మన జీవనశైలి క్రమశిక్షణతో నిండి ఉంటే మన కోపం ఎప్పుడూ అదుపులో ఉంటుంది. అందుకు భగవంతుని పూజ చేయడం మంచి ఫలితాలనిస్తుంది. కోపంగా ఉన్నప్పుడు ఒక్కక్షణం ఆగితే వంద రోజులకు సరిపడా దుఃఖాన్ని తప్పించుకున్నట్టే అని గుర్తించాలి

తల్లిదండ్రులకు మనవి

పిల్లలు మంచిపని చేసినపుడు,సహనం, ఓర్పు,కనపరిచినప్పుడు, శ్రద్ధగా చదువుతూ వున్నా, నలుగురితో మంచి అనిపించుకున్నా, వారిని మెచ్చకోండి దగ్గరకు తీసుకోండి ,అదే వారికి బలం, అవుతుంది. మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది.

తల్లిదండ్రుల యొక్క బాధ్యత

సుపుత్రో సప్తమోరసః అనే నానుడి. అన్యోన్యమైన దాంపత్యంలో కలిగే సుఖం కన్నా ఉత్తమ సంతానం వలన కలిగే ఆనందం వర్ణనాతీతం. పిల్లలు మీ ప్రతిబింబాలని మరువకండి. మీలో కలిగే ప్రతీ భావాలు, గుణాలు, సంస్కార రూపంలో వారిలో దాగుంటాయి. కనుక మీ భావాలను, గుణాలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ ఉండాలి. మీ ప్రవర్తన వారికి ఆదర్శంకావాలి.మీ వారసులు ఎలా జీవిస్తే మీ వంశానికి, సమాజానికి హితం చేకూరుతుందో గ్రహించి ఆ మార్గంలో వారిని తీర్చి దిద్దేందుకై కృషి చేయండి. స్వార్థంతో రాగ ద్వేషాలకు లోబడి మానసిక వత్తిడికి, ఘర్షణకు గురికాకుండా సమర్థవంతులైన తల్లిదండ్రులుగా భావితరానికి మార్గదర్శకులై మీ బాధ్యత నెరవేర్చుకోవాలి.

ఆసక్తి ఉంటే అన్ని విషయాలు గుర్తుంటాయి,అభిమాన హీరో సినిమాలో విషయాలు మర్చిపోతామా? లేదు కదా! మెదడులో అనవసర విషయాలు పెట్టుకోవద్దు. టీవీకి ఎంత దూరంగా ఉంటే... అంత మంచింది. సినిమాలు, స్నేహితులతో చిట్‌చాట్స్, గాసిప్స్ పూర్తిగా తగ్గించేయాలి. వీటినే 'డయేరియా ఆఫ్ టాకింగ్‌కు అంటారు. వాటికి దూరంగా ఉండాలి. రోజులో కొంత సమయం ఏమీ మాట్లాడుకుండా... నిశ్శబ్దంగా ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తీ పెరుగుతుంది.మౌనంగా వుండడం కూడా ఒక గేమ్ లాగా ఎంజాయ్ చేయవచ్చు,మాయింట్లో ప్రతి బుధవారం ఆడవారు మౌనంగా వుంటారు, ప్రతి శుక్రవారం మగవారు మౌనంగా వుంటాము, కేవలం సైగలతో మాత్రమే చెబుతాము, మీరు కూడా ట్రై చేయండి,ఫన్ గా వుంటుంది,🙏

చిన్న చిన్న చిట్కాలు

 నిమ్మ‌కాయ కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నిమ్మర‌సం – 2 లేదా 3 టీ స్పూన్స్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – ఒక‌టిన్న‌ర టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నువ్వుల పొడి – ఒక టీ స్పూన్, మెంతుల పొడి – చిటికెడు, జీలక‌ర్ర పొడి – చిటికెడు.


తాలింపుకి కావ‌ల్సిన ప‌దార్థాలు..


ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, క‌రివేపాకు – అర క‌ప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌చ్చా ప‌చ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బ‌లు – 8.


నిమ్మ‌కాయ కారం త‌యారీ విధానం..


ఒక గిన్నెలో నిమ్మ‌కాయ ర‌సాన్ని తీసుకుని కారం, రుచికి త‌గినంత ఉప్పును, ధ‌నియాల పొడిని, నువ్వుల పొడిని, జీల‌క‌ర్ర పొడిని, మెంతుల పొడిని వేసి బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి కాగిన త‌రువాత తాళింపు ప‌దార్థాల‌ను వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాళింపును ముందుగా అన్నీ వేసి క‌లిపి పెట్టుకున్న నిమ్మ‌ర‌సం మిశ్ర‌మంలో వేసి క‌లిపి పెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నిమ్మ‌కాయ కారం త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. నిమ్మ‌కాయ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. స‌మయం లేని వారు ఈ విధంగా అప్ప‌టిక‌ప్పుడు నిమ్మ‌కాయ కారాన్ని చేసుకుని తినండి. చాలా రుచిగా వుంటుంది.నిమ్మకాయ వల్ల కలిగే లాభాలు మనకు లభిస్తాయి. 

*తలలో చుండ్రు నివారణకు 


40 సంవత్సరాల క్రితం చుండ్రు ఉన్న వాళ్ళు చాలా అరుదుగా కనిపించే వారు ఆ కాలం లో పుట్టిన పిల్లలకు కూడా తలకు ఆముదం రోజూ పట్టించే వాళ్ళు.పెద్దలు కూడా ప్రతిరోజూ తలకు.ఆముదం లేదా కొబ్బరి నూనె పట్టించుకొని తలకు మసాజ్ చేసుకొనే వారు కాబట్టే అప్పట్లో జుట్టు రాలడం,చుండ్రు ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు  కాలక్రమేణా  ప్రజలు జుట్టుకు నూనె రాయటం తగ్గింది వెంట్రుకలు రాలడం, చుండ్రు రావటం పెరిగింది.

ఆముదంను ఆయుర్వేదం లో ఔషధంగా ఉపయోగిస్తారు.


ఆముదంతో చర్మం, జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చిలా! 

చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. చర్మంతోపాటు జుట్టుకూడా పొడిబారుతుంది. దీంతో చుండ్రు సమస్య మొదలవుతుంది. ఇప్పటికే చుండ్రు ఉంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే ఈ సమస్యలేవి రాకుండా ఉండాలంటే చలికాలం ఉన్నన్ని రోజులు జుట్టుకు ఆముదం పట్టిస్తే మంచిది. 


టేబుల్‌ స్పూను ఆముదం, టేబుల్‌ స్పూను కొబ్బరి నూనెలను కలిపి వేడి చేసి గోరువెచ్చగా అయిన తరవాత మాడుకు పట్టించి పదినిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే..చుండ్రు తగ్గడంతోపాటు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 


పొడిబారిన చర్మానికి సైతం ఆముదం మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. బాడీ లోషన్స్‌కు బదులు ఆముదాన్ని రాసుకుంటే మరింత మంచిది. 

గోరువెచ్చని ఆముదాన్ని పలుచగా ఉన్న కనుబొమ్మలకు రాసి రెండు నిమిషాలు మర్దన చేసి ఉదయం కడిగేయాలి. ఇలా కొన్నిరోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా కనిపిస్తాయి. 

రాత్రి పడుకునే ముందు ఆముదాన్ని పెదవులకు రాసి మూడు నిమిషాలపాటు మర్దన చేయాలి. చిన్న బాక్స్‌లో ఆముదాన్ని పోసుకుని రోజులో అప్పుడప్పుడు లిప్‌బామ్‌లా రాసుకుంటూ ఉంటే పెదవులు మృదువుగా, పింక్‌ కలర్‌లోకి మారుతాయి.

భగవద్గీత 1

 , భగవద్గీత ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?*


గీత ఎప్పుడు పుట్టింది? భారతదేశ చరిత్రలో మహాభారత యుధ్ధం ఒక ప్రధానమైన సంఘటన భారత యుధ్ధం జరిగిన తర్వాత 36 సంవత్స రాలకు ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది!!

యుధ్ధ సమయంలో శ్రీకృష్ణుని వయస్సు 90 సం!!రాలు!! శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన నాటి నుండి కలి ప్రవేశం జరిగింది!! అంటే కలియుగం ప్రారంభమైనది!! శ్రీకృష్ణ భగవానుడు దాదాపు126 సంవత్సరాలు

జీవించి యున్నాడు!!

భారత యుధ్ధ విజయం తర్వాత ధర్మ రాజు పట్టాభిషిక్తుడైనాడు కృష్ణ నిర్యాణ వార్త విన్న తరువాత పాండవులు ద్రౌపదీ సహితంగా "మహా ప్రస్థానము" గావిస్తూ హిమాలయాలకు వెళ్లారు!! అంటే యుధిష్టురుడు హస్తినాపుర సింహానముపై కూర్చుని ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా 36 వర్షాలు పాలించాడు!!

మహాభారత యుధ్ధము "కురుక్షేత్రము"లో 18రోజులుజరిగింది!!

కార్తీక అమావాస్య రోజు మహభారత యుద్ధం


ప్రారంభమైనది!! 10 రోజులు భీష్ముడు రణం

చేసి పదవరోజున నేలకొరిగాడు!!

11వ రోజున అంటె మార్గశిర శుధ్ధ ఏకాదశి నాడు సంజయుడు కురుసభలో ధృతరాష్ట్రుడికి యుద్ధవిశేషాలు చెబుతూ భగవద్గీతను చెప్పాడు!! ఆవిధంగా

మొదటి సారి హస్తినాపురములోని సభలో

వున్నవారందరూ ధృతరాష్ట్ర మహారాజుతో పాటు పురజనులు కూడా విన్నారు!!


కార్తీక అమావాస్యరోజు సూర్యోదయ వేళ యుద్ధము ప్రారంభానికి ముందు అపారమైన

కురు - పాండవ సేనావాహినుల మధ్యన

రథముపై చతికిలబడి నిరాశా నిస్పృహలతో

విషాదముతో బాధపడుతున్న అర్జునుని నిమిత్త మాత్రునిగా చేసుకుని శ్రీకృష్ణుడు భగవానుడు మనందరికి భగవద్గీతను బోధించాడు!!

లోకానికి అందినది మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అందుకే మనం ఈరోజు "గీతాజయంతి" ని జరుపుకుంటాం!!

మనం ఇంత వరకు వ్యక్తుల జన్మదినం

జరుపుకుంటున్నాము. జ్ఞాన ప్రధాయిని అయిన ఒక గ్రంథానికి జయంతి జరపటం అనేది అద్భుతమైన విషయం!!

లక్ష శ్లోకాల మహాభారత గ్రంథంలో భీష్మ పర్వంలో 24 నుండి 41వరకు 18 అధ్యాయాలుగా వున్న భాగమే "భగవద్గీత"!!

కలియుగం ప్రారంభమై 5118 సంవత్సరాలు

గడిచాయి!! దీనికి 36 సం.రాలు కలిపితె 5154 సంవత్సరాలు!! ఇప్పుడు మనం 5155 వ గీతాజయంతిని జరుపు కుంటున్నాము!!


కృష్ణం వందే జగద్గురుమ్.

భగవధ్గీతలో 700 శ్లోకములు ఉన్నాయి. వాటిని చదవడానికి ప్రస్తుత కాలంలో ఈ యాంత్రిక జీవన విధానంలో సమయం, సహనం రెండు ఉండవు. కనుక కనీసం కొద్ది నిమిషాల ఈ పరిచయంలో తెలుసుకుంటారనే భావనచేతఈ ప్రశ్న జవాబుల రూపంలో భగవధ్గీత అంటే ఏమిటో తెలుసుకుని తరిస్తారని ఆశిస్తూ ఇవ్వడం జరిగింది.

శ్లోకం:-పార్దాయ ప్రతిబోదితాం భగవతా నారాయణేవస్వయం

వ్యాసేవ గ్రధితాం పురాణ మువివామ్ మధ్యే మహాభారతమ్

అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్

ఆంబ త్వా మమవందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్

1. భగవద్గీత ఏ పవిత్ర గ్రంధంలోనిది ?

జ. మహా భారతమునందలి భీష్మ పర్వంలో గీత వివరింప బడినది.

2. గీతలో ఎన్ని శ్లోకములు గలవు?

జ. గీతలో 700 శ్లోకములు కలవు.

3. గీతలో ఎన్ని అధ్యాయములు కలవు ?

జ. గీతలో 18 అధ్యాయములు కలవు.

4. ప్రతి అధ్యాయమునకు యివ్వబడిన ప్రత్యేక నామము ఏది?

జ. ప్రతి అధ్యాయమును యోగము అందురు.

5. గీత ఎక్కడ, ఎప్పుడు , ఎవరికి చెప్పబడినది?

జ. గీత కురుక్షేత్రంలో కౌరవ, పాండవుల యుద్దారంభంలో అర్జునునికి శ్రీ కృష్ణపరమాత్మచే చెప్పబడినది.

6. గీత ఎందుకు చెప్పబడినది?

జ. నావారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగచేయగా విషాదయోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగచేయడానికి శ్రీ కృష్ణునిచే గీతాబోధ చేయబడినది.

7. గీత దీనుడైన అర్జునుని ఏవిధంగా మార్చినది?

జ. గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది.

8. గీత శ్లోకాలు మానవునిలోని దేనిని దూరం చేస్తాయి?

జ. గీత శ్లోకాలు మానవునిలోని శోకాన్నిదూరం చేస్తాయి.

9. గీత ధృతరాష్ట్రునికి ఎవరు చెప్పారు?

జ. గీతను ధృతరాష్ట్రునికి సంజయుడు వివరించెను.

10. గీతను ఆసమయంలో ఎందరు విన్నారు?

జ. అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు మరియు ఆంజనేయస్వామి.

11. గీతలో గల అధ్యాయముల పేర్లేమి?

జ. 1) అర్జున విషాద యోగము 2) సాంఖ్య యోగము 3) కర్మ యోగము 4) జ్ఞాన యోగము 5) కర్మసన్యాస యోగము 6) ఆత్మ సంయమ యోగము 7) విజ్ఞాన యోగము 8) అక్షర పరబ్రహ్మ యోగము 9. రాజ విద్యారాజగుహ్య యోగము 10) విభూతి యోగము 11) విశ్వరూప సందర్శన యోగము 12) భక్తి యోగము 13) క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 14) గుణత్రయ విభాగ యోగము 15) పురుషోత్తమ ప్రాప్తి యోగము 16) దైవాసుర సంపద్విభాగ యోగము 17) శ్రద్దాత్రయ విభాగ యోగము 18) మోక్ష సన్యాస యోగము

12. గీత ధర్మరాజుకిగాని, భీష్మునికిగాని బోధింపక అర్జునునికే ఏల బోధించెను?

జ. శ్రీ కృష్ణుడు అర్జునునికే గీతాబోధ చేసెను. భీష్మునికి చేయక పోవటానికి కారణం ఏమిటంటే న్యాయం, ధర్మం, పాండవుల పక్షాన ఉందని చెప్తూ అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్దం చేసారు. అలోచనకు, చెప్పేమాటకి, చేసే క్రియకి భేదం ఉన్నది. అనగా త్రికరణశుద్ది లేదు. అట్టివారు జ్ఞానబోధకు అర్హులు కారు.


ధర్మరాజు ధర్మవర్తనుడే కాని అతని పశ్చాత్తాపమేకాని పూర్వతాపం లేదు. ఒక పనిచేసే ముందుగానే దాని మంచి చెడ్డలు విచారించేవాడు పూర్వతాపం కలవాడు. జూదం ఆడి ఓడిపోయి అడవులు పాలయ్యాక జరిగిన దానికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా దాని పర్యవసానం ఏమిటో ఆలోచించలేదు. పూర్వతాపం లేనివారు గీతాబోధకు అర్హులు కారు. అర్జునుడు యుద్ధభూమిలోకి ప్రవేశించి, తనవారినందరిని చూచి యింతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు. అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏమి ఆనందం అనుభవించగలము? త్రిలోకాధిపత్యం యిచ్చినా నేను యుద్ధం చెయ్యలేను అని ముందుగానే విచారించాడు. తనను శిష్యునిగా చేసుకుని కర్తవ్యం బోధించమని శ్రీ కృష్ణ భగవానుని ప్రార్థించాడు. అందువలన అర్జునునికే గీతా బోధ చేయబడింది. పూర్వతాపం పరిశుద్ద హృదయమున్న వారికే కలుగును. పరిశుద్ద హృదయుడే జ్ఞానబోధకు

13. అర్జునుని శ్రీ కృష్ణుడు అనేక నామాలతో గీతలో సంబోదించాడు. అవి ఏవి? వాని భావమేమి?

జ. 1) అర్జున: - పవిత్రమైన, నిర్మలమైన మనసు గలవాడు.

2) పార్థ: - పృధ్వి (భూమి యొక్క) పుత్రుడు. పృధి అను పేరు కుంతీదేవికి కలదు. అంతే కాక భూమి

యొక్క పుత్రుడు అంటే ప్రపంచ మానవులందరికీ ప్రతినిధి పార్ధుడు.3) కౌంతేయ - సావధానంగా దైవబోధను వినగలిగేవాడు.

4) అనసూయ - అసూయ లేనివాడు.

5) కురునందన - కార్యమును చేయుటలో ఆనందమును అనుభవించువాడు.

6) పరంతప - యుద్దములో శత్రువులను తపింప చేయువాడు.

7) విజయ - ఎల్లప్పుడూ జయమునే పొందువాడు.

8) గుడాకేశ - ఇంద్రియ నిగ్రహం గలవాడు.

9) ధనంజయ - జ్ఞాన ధనమును పొందినవాడు.

10) పాండవ - పాండవరాజు కుమారుడు (తెల్లదనము) సాత్వికగుణము , నిర్మలతత్వం గలిగి పరిశుద్దమైనవాడు .

14. భోజనానికి ముందుగా రెండు శ్లోకాలు పఠించి భుజించాలని స్వామి చెప్పారు. ఆ శ్లోకాలేవి? ఎందుకు అవి పఠించాలి?

బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్

బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత:

ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్

ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది. ఆహారానికి పాత్రశుద్ది, పాకశుద్ది, పదార్థశుద్ది ఉండాలని స్వామి చెప్పారు. పాత్రశుద్ది మనంచేయగలం. పాకశుద్ది అంటే ఎలాంటి తలపులతో వంట చేస్తున్నారో, పదార్థశుద్ది అనగా మనం తెచ్చుకున్న పదార్ధములు మోసము చేసి తెచ్చినవో, దొంగిలించినవో మనకు తెలియదు. అన్యాయార్జన పదార్ధము అనారోగ్యాన్ని, దుర్భుద్దులను పెంచుతాయి. అందువలన ఆహారం భుజించేముందు ఆహారాన్ని దైవానికి సమర్పించి భుజిస్తే అది ప్రసాదంగా మారి దోషరహితం అయిపోతుంది. ఎట్టి తిండియో అట్టి త్రేపు. ఆహారాన్ని బట్టి ఆలోచనలు వుంటాయి. అందువలన రజో, తమో గుణ సంబంధమైన ఆహారాన్ని త్యజించి సాత్వికాహారము దైవానికి అర్పించు.

15. గీత నిత్య జీవితంలో ఏవిధంగా మనకు ఉపకరిస్తుంది?

జ. స్వామి ముఖ్యంగా 'శ్రద్దావాన్ లభతే జ్ఞానం' - 'సంశయాత్మ వినశ్యతి ' అని గీతలోని రెండు శ్లోకాల గురించి చెప్ప్తూ ఉంటారు. శ్రద్దగలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. అధ్యాత్మిక జ్ఞానానికైనా , లౌకిక జ్ఞానానికైనా శ్రద్ద చాలా అవసరం. అందువలన శ్రద్దతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది. శ్రద్ధతో నచికేతుడు ఆత్మ జ్ఞానాన్ని , ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించగలిగారు. 'సంశయాత్మా వినశ్యతి ' సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ది సాధించలేడు. గురువాక్యంపైన, దైవం పైన నమ్మకం, శ్రద్ధ గలవాడే ఏదైనా సాధించగలడు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. యింతేకాక 'అద్వైష్టా సర్వభూతానాం' ఏ ప్రాణినీ ద్వేషించవద్దు. 'అనుద్వేగకరం వాక్యం' ఎవరినీ మాటలతో హింసించవద్దు. సంతుష్టస్పతతం' ఎల్లప్పుడు సంతృప్తిగా ఉండాలి. సమశ్చత్రౌ చ మిత్రేచ, శత్రువులను, మిత్రులను ఒకేవిధంగా చూడాలి. గౌరవా గౌరవాలకు, సుఖదు:ఖాలకు పొంగిపోక, కుంగిపోక ఉండాలి. యిలాంటి లక్షణాలు కలవాడు నాకు ప్రియమైన భక్తుడు అని శ్రీ కృష్ణ భగవానుడు బోధించాడు. అంటే మానవులంతా తమ నిత్య జీవితంలో ఈ లక్షణాలు అలవర్చుకుంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. వంట చెయ్యటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాగే ఒక్క గీతా శ్లోకాన్ని మనం ఆచరించడానికి ప్రారంభించినా క్రమేపి అన్ని సద్గుణాలు మనలో ప్రవేశించి భగవంతునికి ప్రియమైన భక్తులం కాగలము.

16. స్వామి గీతా సారాంశాన్ని రెండు పదాల్లో వివరించారు? అవి ఏవి?వాని వివరణ ఏమి?

జ. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:

మామకాకి పాండవాశ్చైవ కీమ కుర్వత సంజయ: "

శ్లోకములోని మొదటి పదము ధర్మ, గీతలోని చివరి శ్లోకము

"యత్ర యోగీశ్వర: కృష్ణా యత్ర పార్థ ధనుర్థర:

శ్రీ ర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ "


చివరి శ్లోకములోని చివరి పదము మమ. మొదటి ధర్మ, చివరిది మమ. ఈ రెండూ చేరిస్తే 'మమధర్మ' అని గీత బోదించింది. ఎవరి కర్తవ్యాన్ని, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించమని గీత ముఖ్యంగా బోధిస్తుంది. విద్యార్దులు వారికర్తవ్యాన్ని, బ్రహ్మచారులు వారికర్తవ్యాన్ని, గృహష్దులు వారి కర్తవ్యాన్ని, నవ్యానులు వారికర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎవరిమార్గాన్నివారికి బోధించేదే గీత.

17. భగవద్గీతలో పేర్కొనబడిన నాలుగు విధములైన భక్తులెవరు?

జ. ఆర్తి, అర్దార్ది, జిజ్ఞాసు, జ్ఞాని

1. ఆర్తభక్తుడు బాధలు కలిగినపుడు తనను ఆదుకొని రక్షించమని ఆర్తితో భగవంతుని ప్రార్దిస్తాడు.

2. ధన కనక వస్తు వాహనముల కోరకు, పదవి పేరు ప్రతిష్టల కోరకు, పుత్ర పౌత్రాభివృద్ది కొరకు పరితపించుచూ

ప్రార్దించువారు అర్దార్దులు.

3. జిజ్ఞాసువు: ఆత్మస్వరూపమైన పరమాత్మమ తెలుసుకోనగోరి అనేక సద్ర్గంధములతో, సదాలోచనలతో,

సద్బావములతో విచారణ నల్పుచూ సాన్నిధ్యప్రాప్తిని పొందగోరును. 4. జ్ఞాని: నిరంతరం బ్రహ్మతత్త్వమున మునిగియుండును.

18. గీత దైవ లక్షణాలను, అసుర లక్షణాలను ఏ విధంగా వివరించింది?

జ. దైవ లక్షణాలు: 1. అభయము 2. చిత్తశుద్ది 3. జ్ఞానయోగమునందుందుట 4. దానము 5. ఇంద్రియనిగ్రహం

6. యజ్ఞము 7.అధ్యయనము 8. తపస్సు 9. కపటములేకుండుట 10. అహింస 11. సత్యము 12. క్రోధములేకుండుట 13. త్యాగము 14. శాంతి 15. కౌండెములుచెప్పకుండుట 16. సమస్తప్రాణులయడల కరుణ

17.విషయములపై మనస్సు పోనీయకుండుట 18. తేజస్సు 19. క్షమ 20. ఆపత్కాలమందు దైర్యమును

వీడకుండుట 21. శుచి, శుభ్రతలు కల్గియుండుట 22. పరులకు ద్రోహముచేయకుండుట 23. మృదుస్వభావము

24. ధర్మవిరుద్ద కార్యములలో ప్రవేశింపకుండుట 25. తననుతాను పొగడుకోనకుండుట 26.తంతుల స్వభావము లేకుండుట అసుర లక్షణాలు : డంభము, గర్వము, దురభిమానము,కోపము,పరులను పిడించునట్లు మాట్లాడుట, వివేక

జ్ఞానహినత, తాను గొప్ప అను అహంకారము, హింస.

ప్రతి మానవుడు తనలోని అసుర లక్షణాలు గుర్తించి వానిని ప్రయత్నపూర్వకంగా దూరంచేసుకొని దైవ లక్షణాలు అలవర్చుకొని భగవంతునిచే ప్రేమించబడే భక్తులుగా తమను తాము తీర్చిదిద్దుకొనవలెను.

19. యోగమనగా నేమి?

జ. యోగమనగా జీవాత్మ పరమాత్మలో లీనమగుట

యోగమనగా దైవాన్ని చేర్చుమార్గము

యోగమనగా ఆనందం

సమత్వమే యోగము

చిత్త వృత్తిని విరోధించునదే యోగము

20. ఇంద్రియాలకు వైరాగ్యమును అలవరచాలని స్వామి చెప్పారు. కారణం ఏమిటి?

జ. గీతలో శరీరమునుండి జీవాత్మ మరొక శరీరములోనికి ప్రవేశించినపుడు తన సత్కర్మ, దుష్కర్మలను తప్ప మరేమి తీసుకొని వెళ్ళలేదు. వాయువు ఏవిధంగా ఒక ప్రదేశంలోని దుర్గంధాన్ని, సుగంధాన్ని తీసుకొని వేరొక ప్రదేశానికి వెళ్తుందో అదే విధంగా ఆత్మ కర్మఫలమునుతప్ప మరేదీ ఈ ప్రపంచం నుండిగాని, తన గృహము నుండిగాని తీసుకొని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువులయందు, భోగ భాగ్యముల నుండి మనసును సత్కర్మలవైపు, దైవముపైన మరల్చి ప్రాపంచిక భోగములపై వైరాగ్యమును అలవర్చుకొనవలెను. దీని ఉదాహరణకు స్వామి చిన్న కథ చెప్తారు.ఒక గృహస్తునకు ముగ్గురు మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరుగబోతుంది. తన మిత్రులను తనతో కోర్టుకువచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరతాడు. మొదటి మిత్రుడు నేను ఇంట్లో నీకేమైనా సహాయం చేస్తాగాని ఇల్లుదాటి బయటకురాను అన్నాడు. రెండవ మిత్రుడు కోర్టువరకు నీకు తోడు వస్తానుగాని లోనికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు నేను నీతో కోర్టులోనికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ధనధాన్యాది సంపదలు. రెండవ మిత్రుడు భార్య,బంధు మిత్రులు. మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు.

21. స్వధర్మమంటే ఏమిటి? పర ధర్మమంటే ఏమిటి?

జ. ఆత్మ సంబంధమైన ధర్మం స్వధర్మం, పర ధర్మమంటే దేహ సంబంధమైన ధర్మం.

22. అర్జునుడి పేర్లు వల్ల వ్యక్తమయ్యే విలక్షణ వ్యక్తిత్వం ఏమిటి?

జ. గురువు వద్ద నుండి విద్యకు శిష్యుడుగా ఏవిధంగా ఆదర్శంగా వుండాలో అర్జునుని పై పేర్ల ద్వారా తెలుసుకోగలము.

23. "యోగం" అంటే అర్థం ఏమిటి?

జ. భగవంతునితో సం యోగము చెందుటే యోగం. అంతేకాకుండా భగవంతుని చేరే మార్గము (గమ్యము) .

24. భగవద్గీతలో యోగం ఏవిధంగా నిర్వచింపబడినది?

జ. "కర్మను కాశలమ్ యోగ:" అన్నది గీత.

భగవత్ గీత చదివితే మన జీవనగతి గీత మారుతుంది.


భార్యాభర్తలు ప్రశాంత జీవనసూత్రాలు

   భార్యాభర్తలు ప్రశాంత జీవన సూత్రాలు కుటుంబం అంటే సామరస్యం, అంతే తప్ప సాధించడాలు, కోపాలు, పగలు, ప్రతీకారాలు కాదు, ఎవరూ ఎవరికీ బానిసలు కాదు,...