ఏ పూజ అయినా పాటించాల్సిన నియమాలు ఇక్కడ తెలియజేస్తున్నాను మళ్ళీ ఏ దేవుని పూజకు ప్రత్యేకంగా ఏ నియమాలు పాటించాలి వేరేగా వివరిస్తాను, ఏ నియమాలు అయినా శరీరం సహకరించినంత వరకే పాటించాలి , అంతే తప్ప శరీరాన్ని బాధపెట్టి, ఏ నియమాలు పాటించనవసరం లేదని తెలుసుకోవాలి.
సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని,తల స్నానం చేయాలి శుభ్రమైన వస్త్రములను ధరించాలి, బొట్టు పెట్టుకోవాలి, సంకల్పించిన పూజ నియమానుసారం , నేల మీద ఒక ఆసనం వేసుకుని ఎలా కూర్చుంటే కూర్చున్నట్టు తెలియదో అలా సుఖంగా కూర్చోవాలి లేదా పద్మాసనంలో కూర్చుని ముందుగా ఆవునేతితో దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో, ప్రశాంతంగా, ఏకాగ్రతగా , యధావిధిగా పూజ చేయాలి,
పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించాకే లేవాలి, ఒకపూట భోజనం ఒకపూట అల్పాహారం తీసుకోవాలి, వివాహం అయిన వారు భార్యాభర్తలు ఆరోజు విడివిడిగా పడుకోవాలి, వెల్లుల్లి,ఉల్లిపాయ, మషాళాలు వాడకుండా ఉంటే మంచిది, నియమాలు నీ శరీరాన్ని, తద్వారా నీ మనసును నీ అధీనంలో ఉంచుకోవడానికే అని తెలుసుకోవాలి, ఆ రోజంతా ఎవరితోనైనా వీలైనంత తక్కువగా మాట్లాడాలి , ఆవేశం, కోపం రాకూడదు, నేల మీద చాప దిండు వేసుకుని పడుకోవాలి, మంచం, పరుపులు పనికిరాదు,