నావయసు 58 నాకు, బీపీ లేదు, షుగర్ లేదు ఎందుకంటే
ఏది నాది, ఏది నాది కాదు, ఏది పట్టుకోవాలి, ఏది విడవాలి, ఇది ఒక్కటి వివరంగా తెలుసుకుంటే, సమస్యలు వుండవు, టెన్షన్ వుండదు, భయం వుండదు, మోజులు వుండవు, తద్వారా నాకు బీపీ, షుగరు, లేదు,
నేను దేవుడిని నమ్ముతాను, వాస్తు, జ్యోతిష్యం, ఆయుర్వేదం, నమ్ముతాను పాటిస్తాను, ఇదంతా నేను ఎవరికీ ఋజువు చేయలేను, ఎవరి మటుకు వారు పరిశోధించి తెలుసుకోవాలి, కావాలంటే సమాచారం మాత్రం ఇవ్వగలను. 9490478707. రాజమండ్రి,
సంతోషమే సగం బలం.. ఎప్పుడూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి
కోపం, ద్వేషం, ఆవేశం, అహంకారం.. ఈ దుష్టచతుష్టయాన్ని వదిలేయండి.స్వీట్ & సాల్ట్ బాగా తగ్గించేయండి.
ఇంటి ఇలవేలుపు, ఇష్ట దైవం పై నమ్మకం పెంచుకోండి
కడుపులో ఎప్పుడూ మంచి నీరు ఉండేలా చూసుకోండి. యూరినేషన్ ఐన తరువాత ఓ అరగ్లాసు మంచి నీళ్ళు తాగడం మరువకండి.
వ్యాయామం, వాకింగ్, సైక్లింగ్.. సమయం క్రమం తప్పకుండా వీటిలో ఒకటి రెండు చేస్తుండండి..అరగంట కోసారి కదలిక ఉండేలా చూసుకోండి..కాఫీ ఐనా టీ ఐనా రోజుకి మూడు సార్లు మించకుండా తీసుకోండి అలవాటు ఉంటే..మోహాలు వ్యామోహాలు వదిలేయండి..* ఎవరినీ విమర్శించకండి ద్వేషించకండి..*పిల్లలు పెద్ద వాళ్ళయ్యారు గనుక వారి విషయంలో జోక్యం చేసుకోకండి. అడిగితేనే సలహాలు సూచనలు ఇవ్వండి..అందుబాటులో ధ్యాన కేంద్రాలు ఉంటే వెళుతుండండి..*బిగుసుగా ఉండే బట్టలు వేసుకోకండి..*
ఉన్న అభిరుచులను (హాబీలు) పెంచుకోండి. మెదడుకు పదును పెట్టే పజిల్స్ చేస్తుండండి..*