స్థలాన్ని ఎన్నుకోవడం ఎలా?
నూతన గృహ నిర్మాణానికి చతురస్రాకార లేక సమకోణ దీర్ఘచతురస్రాకారంగానో ఉన్న స్థలాన్ని ఎన్ను కోవడం సర్వదా శ్రేయస్కరం అయితే దీర్ఘచతురస్రాకార స్థలం 1:2 నిష్పత్తిలో ఉంటే మంచిది. ఉదాహరణకు 30 అడుగులు వెడల్పు ఉంటే 60 అడుగులు పొడవు ఉండాలి. విశాలమైన స్థలం మునల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది.
మీ గృహానికి గానీ, స్థలానికి గానీ, తూర్పుగా, ఉత్తరంగా వున్న స్థలాన్ని మాత్ర కొనేందుకు సిద్ధపడండి. ఈశాన్య దిశగా ఉన్న స్థలాన్ని కొనేందుకు వెనుకంజ వేయకండి.
మీస్థలం యొక్క మిట్ట పల్లాల ప్రభావం మీ జీవితాలపై ప్రతిబింబిస్తున్న తూర్పు ఉత్తరం, దిశలకు పల్లంగా వున్న స్థలం మీ మీద వరాల వర్షాలను కురిపిస్తుంది. మీ స్థలానికి పడమర, దక్షిణాలు మిఱ్ఱుగా వుంటే మీ బ్రతుకు బంగారు పంటే. ఇ స్థలమందు నివసించేవారు సునాయసంగా గొప్ప పనుల్ని సాధిస్తారు. సాధ్యమైనంత అధిక విస్తీర్ణత గల స్థలాన్ని ఎన్నుకోవడం శ్రేయస్కరం. ఎందువల్లనంటే పెద్ద స్థలం! మీకు కావల్సినన్ని గదులు నిర్మించుకోవచ్చును.
తిన్నగా వంపులు లేక ఉత్తరంగా, తూర్పుగా వెళ్ళే రోడ్లున్న స్థలాన్ని ఎన్నుకోవడం మంచిది.
స్థలం దిక్సూచిని అనుసరించి వున్నప్పుడు నిర్మించబోయే గృహం కూడా దిక్సూచిని అనుసరించి వుంటుంది. అలాగ లేని స్థలాన్ని దిక్సూచికి సరిచేసేందుకు ప్రయత్నిస్తే ఆ గృహం అన్ని దిశలు అనగా ఆగ్నేయ, నైరృతి, వాయవ్య, ఈశాన్యాలు పెరిగి దిక్ మూఢమేర్పడును. కావున స్థలం దిక్సూచికి కలియకపోతే ఆ స్థలాన్ని ఆనుకొని వున్న రోడ్డును, ప్రక్కనున్న ఇండ్లను అనుపరించియే గృహాన్ని నిర్మించుకోవాలి. దిక్సూచికి సమాంతరముగానూ, నిలువుగానూ, రోడ్డువున్న స్థలాన్ని ఎన్నుకోవాలి. ఈశాన్యం పెంచుకుంటూపోయిన వీధి మీ విధిని కూడా మారుస్తుందనడం యథార్థం. అదియే మీ బ్రతుకునకు బంగారు బాటవుతుంది. మీ ప్లాటుకు పశ్చిమ, దక్షిణ దిశలుగా ప్లాట్లు ఎంత ఉన్నతంగా ఉండునో, మీ జీవనం గూడా అంత అభ్యున్నతి నొందగలదు.
త్రిభుజాకృతిగా వున్న స్థలాన్ని ఎన్నడూ ఎన్నుకోరాదు. అనగా తూర్పు, ఉత్తరాలందు ఎత్తైన గుట్టలున్నా, పశ్చిమ, దక్షిణాల్లో పల్లమైన చెరువులు, నదులూ వున్నా వానిని మార్చేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. అలాగే ఈశాన్యాన్ని ఖండిస్తూ ఏర్పడిన రహదారిని మార్చడం కూడా అలవిగాని పనియే. పెద్ద వైశాల్యం గల రెండు స్థలాల నడుమనున్న ఇరుకైన చిన్న వైశాల్యం వున్న స్థలం కూడా నిరుపయోగమైందే.
బాగా వాయవ్య దిక్కుగా గానీ, నైరృతి దిక్కుగా గానీ, ఆగ్నేయ దిక్కుగా గానీ చొచ్చుకొని పోయిన స్థలాన్ని ఎన్నడూ ఎన్నుకోరాదు.
మీ గృహాలకు వున్న ఖాళీస్థలాలు దక్షిణ, పశ్చిమాలందు ఉత్తరం, తూర్పుకంటే హెచ్చుగా వుంటే వాటిని తగ్గించి గోడతో గానీ, కంచెతో గానీ వేరుచేసి ఆ స్థలంలో వైదృతిన షెడ్డు వేయటమో, లేదా విక్రయించటమో చేయాలి.










