Labels,

1aaఘంటసాల గీత (1) 1ab108శుక్రవారములువేంకటేశ్వరునిపాదములకుఅభిషేకం (1) 1abనీఆనందంఎక్కడవుందోతెలుసా (1) 1abసులువుగాఆనందంగాబ్రతకడంఎలా (1) 1aవివాహానికిసరిపడునక్షత్రములు (1) 1aశిశువుపుట్టిననక్షత్రముమంచిదాకాదాదోషాలువున్నాయాఇక్కడచూడండి (1) 1aసంతోషం (1) 1bనాపేరునిబట్టినక్షత్రము (1) 1cనవగ్రహరెమిడీస్ (1) 1m100tables (1) 1m100tablesinsinglesheet (1) 1m100tableswithname (1) 1m1to100tablesfor20 (1) 30days (1) 5artbrushes (1) 6qus (1) 9Bhagavadgita (1) 9bottons (1) agecalculatorinyearsmonths (1) ashtotharalu (1) Business (1) Dealoftheday (1) differentappsinthispage (1) differentbrushes (1) DynamicStoryGenerator (1) Flippingcard (1) ghantasalagita (1) Govinda (1) Lawofatraction (1) lovestorygenerator (1) Money (1) MoneyBusinessGovernmentjob (1) muggulu (1) newstylishbuttons (1) omnamahshivaya (1) Onemovement (1) peacockcards (1) super app (1) Superbrush (1) superPasswordGenerator (1) Varietycard (1) vasthu (1) vasthu planer (1) vastu tips (1) Weddinginvitationgenaretor (1) WeddingInvitationGenerator (1) Whatisthis (1) wow app (1) yourrasi (1) అధ్భుతమైనరెమిడీమీకోసం (1) ఆయుర్వేదం (1) ఇక్కడమీపేరునిటైపుచేసిమీలక్కీనెంబర్స్ (1) ఇలావెరైటీగామెసేజ్పంపించండిసర్ప్రైజ్అవుతారు (1) ఏపూజఅయినాపాటించాల్సిననియమాలు (1) కాశీయాత్రవిధివిధానం (1) గ్రామదేవతలవివరాలు (1) తెలుసుకోండి (1) దేవాలయనియమాలు (1) ధనలక్ష్మీప్రాప్తికి (1) ధనాకర్షణ (1) నక్షత్రాలు (1) నవగ్రహపూజలు (1) నాకుబీపీషుగరులేదుఎందుకంటే (1) నువ్వుఎవరుఇక్కడసులువుగాతెలుసుకో (1) నేనుచేస్తున్నతప్పులుఏమిటి (1) పిల్లలకునేర్పాల్సినధ్యానశ్లోకములు (1) పిల్లలకునేర్పించండి (1) బూడిదగుమ్మడికాయకట్టేవిధానం (1) భార్యాభర్తలుప్రశాంతజీవనసూత్రాలు (1) మనసుబుద్ధిఆత్మఎక్కడవుంటాయి (1) మీగోత్రనామాలతోకాశీమహాక్షేత్రంలోమహాశివరాత్రిఅభిషేకం (1) మీనక్షత్రానికిడబ్బులుతెచ్చే3నక్షత్రాలు (1) మీరుమగపెళ్ళివారాఆడపెళ్ళివారాఇక్కడతెలుసుకోండి (1) మీలక్కీనంబర్స్ తెలుసుకోండి (1) రాశిఏదివస్తుంది (1) విధులు (1) వెరైటీక్విజ్ (1) వెరైటీమెసేజ్ (1) శిశువుపుట్టినసమయాన్నిఎలానిర్ణయించాలి. (1) సందేహాలుసమాధానాలు (1) సప్తవ్యసనాలుఅంటేఏమిటి? (1)

20 Jan 2024

AyurvedamGuru

 ఆయుర్వేదం 

ఆయుర్వేద చికిత్సా విధానమంతా  శరీరతత్వం మీదే ఆధారపడి వుంటుంది. ఈ తత్వాలు మూడు రకాలు. అవి వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం. వీటిని గురించి తెలుసుకోకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడం అసాధ్యం.

జీవకణాల్లో జరిగే రసాయనిక, భౌతిక మార్పులను పిత్తదోషం నియంత్రిస్తుంది.

నిర్మాణాన్ని కఫదోషం నియంత్రిస్తుంది.

మన శరీరంలోని ప్రతి కణంలోనూ ఈ మూడు సూత్రాలూ వుంటాయి.

సజీవంగా వుండాలంటే శ్వాస, రక్తప్రసరణ, జీర్ణమార్గంగుండా ఆహారం పోవడం వంటి వాటిని కలిగించే చలనం లేక వాతం శరీరంలో వుండాలి. నాడులద్వారా మెదడు సందేశాలు అందుకోవడానికీ, ఆజ్ఞలు జారీచేయడానికీ కూడా వాతం అవసరం.

మొత్తం శరీరమంతటా ఆహారం, గాలి, నీరులను అవసరమైన శక్తిగా మార్చేందుకు శరీరంలో రసాయనిక, భౌతిక మార్పు లేక పిత్తం వుండాలి.

కణాలను దగ్గరగా కలిపి వుంచి, కండరాలు, కొవ్వు, ఎముకలు, ధాతువులు రూపొందించడానికి నిర్మాణం లేక కఫం శరీరంలో వుండాలి.

మానవ శరీర నిర్మాణానికి ఈ మూడూ అవసరమే.

దోషాలు మూడు వుండడాన వాటిలో ఏది ఆధిక్యతలో వుందనే అంశం మీద ఆధారపడి ఆయుర్వేద విధానంలో మూడు ముఖ్య శరీరతత్వాలున్నాయి. ఒక వ్యక్తిది వాతతత్వం అంటే అతనిలో వాత లక్షణాలు బాగా ఎక్కువగా వున్నాయని అర్థం. అంటే అతనిది వాత ప్రకృతి అన్నమాట.అతను తీసుకునే ఆహారం, వ్యాయామం, రోజువారీ పనితీరు, వ్యాధి నిరోధక పద్ధతులు  అన్నీ ఈ తత్వం మీద ఆధారపడే నిర్ణయించబడతాయి. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి: ఒక వ్యక్తి ఏ తత్వానికి చెందినవాడైనా అతనిలో మూడు రకాల దోషాలూ కనిపిస్తాయి. పూర్తి సమతుల్యతను సాధించడానికి శరీరతత్వం ఎలాటిదో తెలిసి వుండడం ముఖ్యం. దానివల్ల మార్పుకి అవసరమైన ముఖ్యమైన వాటినన్నిటినీ సమకూర్చుకోవచ్చు. ప్రకృతి మనల్ని ఎలా రూపొందించిందో అదే విధంగా మనం కలకాలం వుండడం వీలవుతుంది.



శరీరతత్వ పరీక్ష

క్రింద మూడు భాగాలుగా మూడు ఇరవైలు 60 లక్షణాలు, ప్రశ్నల రూపంలో వున్నాయి. ఒకసారి ముందు మీరు ఆ ప్రశ్నలు లక్షణాలు పూర్తిగా ఒకసారి చదివి వాత దోషానికి సంబంధించిన మొదటి 20 ప్రశ్నలలో.... ప్రతి లక్షణాన్నీ చదివి, అది మీకు సరిపోతుందో, లేదో చూసి, 0 నుంచి 6 వరకు మార్కులివ్వండి. ఈ లక్షణం నాకు బాగా సరిపోతుంది అనుకుంటే 6 మార్కులు. ఇవ్వండి .అప్పుడప్పుడు ఆ లక్షణం కనిపిస్తుంది అనుకుంటే 3 మార్కులు ఇవ్వండి ,ఈ లక్షణం నాకసలు సరిపోదు అని నమ్మకంగా అనుకుంటే 0 మార్కులు ఇవ్వండి. ఇలా ఈ మొదటి భాగంలోని ప్రశ్నలన్నింటికీ మార్కులు ఇచ్చి ఆ మొత్తం కూడితే మీ శరీరంలో వాత  తత్వం ఎంత శాతం వుందో తెలుస్తుంది. అలాగే పిత్త, కఫ తత్వాల ప్రశ్నలు విషయంలో కూడా ఇదే పద్ధతి అనుసరించాలి.

అన్నీ పూర్తి అయ్యాక, మూడు విడివిడి మార్కుల.  మొత్తాలు వస్తాయి. వీటిని పోల్చి చూస్తే మీ శరీరతత్వం తెలిసిపోతుంది. అది తెలిస్తే ఇక మన 'అరచేతిలో ఆరోగ్యం' వున్నట్లే దాదాపుగా.

భౌతిక లక్షణాల విషయంలో అయితే మన ఎంపిక సాధారణంగా స్పష్టంగానే వుంటుంది. మానసిక లక్షణాలు, ప్రవర్తన విషయంలో అయితే జీవితంలో ఎక్కువగా లేదా కనీసం గత కొద్ది సంవత్సరాలుగా మన అనుభూతి, ప్రవర్తన, లక్షణాలు ఎలా వుండేవో గుర్తుంచుకుని గుర్తుకు తెచ్చుకుని తదనుగుణంగా మార్కులు ఇవ్వాలి. ఏ తత్వం సంబంధించిన మార్కులు శాతం ఎక్కువ వస్తే మీ శరీరం ఆ తత్వాన్ని కలిగి వుందని తెలుసుకోవాలి మూడు తత్వాల మార్కులు సమానంగా వస్తే మీ శరీరంలో మూడు తత్వాలు వున్నాయని తెలుసుకోవాలి.



వాత తత్వం లక్షణాలు 



1. నేను పనిని అత్యంత వేగంగా చేస్తాను.

2. విషయాలు జ్ఞాపకం ఉంచుకుని తర్వాత గుర్తు చేసుకోవడం నాకు కష్టంగా వుంటుంది.

3. స్వభావరీత్యా నాలో జీవచైతన్యం, ఉత్సాహం నిండి వుంటాయి. 

4. నేను సన్నగా వుంటాను తేలిగ్గా బరువు పెరగను. "

5. ఎప్పుడూ కొత్త విషయాలను వేగంగా నేర్చుకుంటాను.

6."నా నడక తీరు తేలికగా, వేగంగా వుంటుంది.

7. నిర్ణయాలు తీసుకోవడం నాకు ఇబ్బందికరంగా వుంటుంది.

8. కడుపులో గాస్ బాధకి, విరేచన బద్ధకానికి తేలికగా గురవుతాను.

9. నా చేతులు, కాళ్ళు చల్ల బడుతుంటాయి.

10. తరచుగా ఆతృతకి లేక చింతకి గురవుతుంటాను.

11. నేను చలి వాతావరణాన్ని తట్టుకోలేను.

12. నేను వేగంగా మాట్లాడతాను, 

13. నా మూడ్స్ తేలికగా మారతాయి, స్వభావరీత్యా నేను కొంత ఎమోషనల్గా వుంటాను.

14. నిద్రపట్టడం, రాత్రి గాఢనిద్ర పోవడం నాకు తరచుగా ఇబ్బందికరంగానే వుంటాయి.

15. నా చర్మం, ప్రత్యేకించి చలి కాలంలో, బాగా పొడిగా వుంటుంది.

16. నా మనసు చాలా చురుగ్గా వుంటుంది. కొన్ని సమయాలలో విశ్రాంతే వుండదు.

17. నా కదలికలు చాలా వేగంగా, చురుగ్గా వుంటాయి. నాలో శక్తి ఉప్పొంగి వస్తుంది హఠాత్తుగా,

18. తేలికగా ఉద్వేగానికి గురవుతాను.

19. నేను ఒక్కడినే వుంటే, నా ఆహారపు అలవాటులు, నిద్ర పద్ధతులు ప్రత్యేకంగా వుంటాయి.

20. నేర్చుకోవడం, అలాగే మర్చి పోవడం కూడా వేగంగానే చేస్తాను


పిత్త తత్వం లక్షణాలు 


 1. నన్ను నేను అత్యంత సమర్థవంతునిగా భావిస్తాను 

2. నా పనుల్లో నేను చాలా ఖచ్చితంగా, క్రమశిక్షణతో పని చేస్తాను 

3. నాది దృఢమైన మనసు, నా పద్దతి కొంతవరకు పట్ధుల ధోరణిలో వుంటుంది.

4. వేడి వాతావరణంలో నేను ఎక్కువగా అసౌకర్యానికి గురౌతాను లేదా తేలికగా అలసిపోతాను.

5. నాకు తేలికగా చెమట పడుతుంది. 

6. నేను చాలా తేలికగా చిరాకుకి, కోపానికి గురౌతాను.

7. భోజనం మానేసినా లేక ఆలస్యంగా చేసినా అసౌకర్యానికి గురౌతాను. 

8. త్వరగా నెరవడం, లేక పల్చగా బట్టతల ఏర్పడడం, చక్కటి, పొడవైన తిన్నటి జుత్తు, ఎరుపు లేక ఇసుకరంగు జుత్తు - పై వాటిలో ఏదో ఒకటి లేక ఎక్కువ లక్షణాలు నా జుత్తుకు వర్తిస్తాయి.

9. నాకు మంచి ఆకలి వుంది: కావాలంటే బాగా ఎక్కువ తినగలను.

10. అనేకమంది నన్ను మొండివాడిగా భావిస్తారు.

11. నాకు చాలా క్రమబద్ధమైన విరేచన అలవాట్లున్నాయి. నాకు విరేచనం సాఫీగా అవుతుంది తప్ప బిగదీసుకోవడం వుండదు. 

12. నేను చాలా తేలికగా అసహనానికి గురౌతాను.

13. ఏ విషయంలో అయినా పరిపూర్ణత వుండాలనే భావన నాలో వుంటుంది.

14. చాలా తేలికగా కోపం వస్తుంది. అయితే దాన్ని వెంటనే మర్చి పోతాను.

15. ఐస్క్రీములు, కూల్డ్రింక్స్ వంటి శీతల పదార్థాలంటే నాకు చాలా ఇష్టం.

16. గది బాగా చల్లగా వున్నప్పటి కన్నా బాగా వేడిగా వున్నప్పుడు నాకు బాగా తెలుస్తుంది.

17. బాగా వేడిగా వున్న ఆహార పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు నాకు సహించవు.

18. అభిప్రాయ భేదం తలెత్తినపుడు చూపవలసినంత సహనాన్ని చూపలేను.

19. సవాళ్ళంటే నాకిష్టం. ఏదైనా కావాలనుకుంటే దాన్ని పొంద డానికి గట్టి కృతనిశ్చయంతో ప్రయత్నిస్తాను.

20. ఇతరుల గురించి, నా గురించి కూడా నేను చాలా విమర్శనా త్మకంగా వ్యవహరిస్తాను.



కఫతత్వ లక్షణాలు



1. నిదానంగా, విశ్రాంతిగా పని చేయడం నా సహజ పద్ధతి.

2. అనేకమంది కన్నా చాలా తేలికగా నేను బరువు పెరుగు తాను, బరువును చాలా

నిదానంగా కోల్పోతాను.

3. నేను నిదానంగా, మౌనంగా పనిచేసుకుపోతాను. అంత తేలికగా కలతకి గురికాను.

4. ఎలాటి ప్రత్యేకమైన అసౌకర్యమూ లేకుండా భోజనం లేకపోయినా వుండగలను.

5. అధిక తేమ, కఫం, దీర్ఘకాలిక రక్తనాళాల ఉబ్బు, ఉబ్బసం, నాసికా రంధ్రాల సమస్యలకు గురౌతు ఉంటాను..

6. తర్వాతి రోజు ప్రశాంతంగా వుండాలంటే తప్పనిసరిగా కనీసం ఎనిమిది గంటలు నిద్రపోయి తీరాలి.

7. బాగా గాఢంగా నిద్రపోతాను.

8. నాది ప్రశాంతమైన స్వభావం, అంత తేలిగ్గా కోపం రాదు.

9. కొంతమందిలా అతిత్వరగా నేను దేనినీ నేర్చుకోలేను కానీ తెలుసుకున్న దాన్ని చక్కగా గుర్తుంచుకుంటాను, నాది చక్కటి జ్ఞాపకశక్తి.

10. తేలికగా వళ్ళు వస్తుంది, బరువు పెరుగుతాను.

11. చల్లని, తేమ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుంది.

12. నా జుత్తు వత్తుగా, నల్లగా, వంకీలు తిరిగి వుంటుంది.

13. పాలిపోయిన రంగుతో కూడిన నున్నటి, మృదువైన చర్మం నాది.

14. నాది దృఢమైన, భారీ ఆకృతి.

15. ప్రశాంతత, మంచి స్వభావం, ఆదరం, క్షమ - అనే పదాలు నాకు వర్తిస్తాయి.

16. నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల తిన్న తర్వాత బరువుగా అనిపిస్తుంది.

17. నాకు మంచి దమ్ము వుంది. మంచి భౌతిక సహనం, స్థిరమైన శక్తి వున్నాయి.

18. నెమ్మదిగా, కొలత వేస్తున్నట్లుగా వుంటుంది నా నడక తీరు.

19. అతినిద్ర, లేవగానే మగతగా వుండడం, సాధారణంగా ఉదయం పూట బద్ధకంగా వుండడం - అనేవి నా లక్షణాలు.

20. నిదానంగా తింటాను. పనులు నెమ్మదిగా, పద్ధతిగా చేస్తాను.


శరీర తత్వాన్ని తెలుసుకోవడం

దోషాలు మూడు మాత్రమే అయినా వాటిని కలగలిపి ఆయుర్వేదం పది వేరువేరు రకాల శరీర తత్వాలను నిర్ణయించింది.

తుది మూడు తత్వాల మూడు  అంకెలను ఒకచోట వేసి చూస్తే ఏదోషం ఎక్కువగా వుంది మీకు సులువుగా తెలుస్తుంది 

ఏకదోష తత్వాలు :

పిత్తతత్వం

కఫతత్వం

వాతతత్వం

వ్యక్తి ఏకదోష తత్వం గలవాడు. అంటే దాని అర్ధం ఒకదాని మొత్తం రెండవ దానికన్నా రెట్టింపు ఉండడం (ఉదాహరణకు, వాతం - 90, పిత్తం - 45, కఫం - 35) వుండడం జరిగితేనే అది ఏకదోషతత్వం అవుతుంది. దీనికి అతిస్వల్ప తేడాలు కూడా ఉండవచ్చు. నిజమైన ఏకదోషతత్వం వాత, పిత్త, కఫ లక్షణాలను అతి స్పష్టంగా ప్రదర్శిస్తుందని గ్రహించాలి.


మన  ప్రవర్తనల మీద దీని తర్వాత అధిక స్థాయిలో వున్న దోషంకూడా తక ప్రభావాన్ని చూపించినప్పటికీ అది తక్కువ స్థాయిలోనే వుంటుంది.

ద్విదోష తత్వాలు :

వాత-పిత్త లేక పిత్త-వాత తత్వం

పిత్త-కఫ లేక కఫ-పిత్త తత్వం

కథ-వాత లేక వాత-కఫ తత్వం

ఏ దోషమూ పూర్తి స్థాయి అధిక్యతలో లేకపోతే, ఆ వ్యక్తి ద్విదోష తత్వంగల వాడు, దీని అర్ధం ఏమిటంటే ఆ వ్యక్తి ఒకేసారి లేక ఒకదాని తర్వాత ఒకటిగా ఆ రెండు ముఖ్య దోషాల లక్షణాలనూ ప్రదర్శిస్తాడు. రెండింటిలో అధికంగా వున్నది శరీరతత్వంలో మొదటి దానిగా వస్తుంది. అయితే రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.

అనేకమంది ద్విదోషతత్వం గలవారే అయ్యుంటారు. కొందరిలో మొదటి దోషం బాగా బలంగా వుంటుంది వారిలో లెక్క వాతం 70, పిత్తం 90, కఫం- 46 వంటి రీతిలో వుంటుంది. ఇక్కడ మరొకటి అయిన వాత దోష ప్రాముఖ్యతను ప్రక్కన పెడితే, ఆ వ్యక్తిని శుద్ధ పిత్తతత్వం గలవాడిగా చెప్పవచ్చు. వ్యత్యాసం బాగా తక్కువగా వుండే ఇతర సందర్భాలలో కూడా మొదటి దోషమే బలమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే రెండోది కూడా దాదాపుగా సమంగానే వుంటుంది. వాతం 85, పిత్తం 80, కఫం - 40 లెక్కలో వుండే వాత - పెత్త తత్వంలో ఈ రెండు దోషాలూ దాదాపు సమంగానే వుంటాయి.

మరికొందరిలో ఒక దోషం ప్రస్ఫుటంగా వుండి, మిగిలిన రెండూ సమానంగా వుండడమూ జరగొచ్చు (ఉదాహరణకి, వాత - 69, పిత్తం - 86, కఫం - 69). వాళ్ళుకూడా ద్విదోష తత్వంగలవారిగానే పరిగణించబడతారు. అయితే ఈ పరీక్షలో రెండో దోషం గురించి పట్టించుకోరు - ఆ వ్యక్తులు పిత్త- వాత, లేక పిత్త-కఫ తత్వంగలవారిగా ఎంచబడతారు. ఇలాటి పరిస్థితిలో, ముఖ్యమైన ఆధిక్యతగల మొదటి దోషంమీదే శ్రద్ధ చూపించాలి. కాలానుగుణంగా రెండోది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

త్రిదోష తత్వం : వాత-పిత్త-కఫ తత్వం

మనలోని మూడు దోషాలూ దాదాపు సమానంగా (ఉదాహరణకి, వాతం - 88, పిత్తం - 75, కఫం80) వుంటే, అప్పుడు మనది త్రిదోష తత్వం అవుతుంది ఏమైనా, ఇలాటి తత్వం చాలా అరుదుగా కనిపిస్తుంది. 

మీ సమాధానాలు జాగ్రత్తగా పరిశీలించుకోండి. అవసరమైతే మీ గురించి బాగా తెలిసిన ఆప్తుల సహాయం తీసుకోండి. మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా పరీక్షించుకోండి. తర్వాత పేజీలలో వివరించబడిన వాత, పిత్త, కఫ వివరణలు చదివి, మీ తత్వంలో ఒకటి లేక రెండు దోషాలు ప్రాముఖ్యత వహించడం జరిగిందేమో పరిశీలించండి. లేకపోతే, ఆ పైన వివరించిన త్రిదోష తత్వం గురించి చదవండి.


వాతం అయోమయాన్ని సృష్టిస్తుంది. మీరు చాలా ప్రశ్నలకి స్పష్టమైన సమాధానాలు చెప్పలేకపోవడం జరిగితే, దానికి కారణం మీ తత్వంలోని వాతం కావచ్చు. వాతం దోషాలకు రాజులాంటిది. అది పిత్తం, కఫంలలా కూడా కనిపించొచ్చు. మీరు సన్నగా వున్నా అతిబరువుగా కూడా వుండొచ్చు. చింతకు లొంగడమే కాక చిరాకు పడనూ వచ్చు. ఎంతోకాలం నిద్రలేమితో బాధపడిన తర్వాత అతినిద్ర బారిన పడొచ్చు. వాతం కలిగించే అసమతుల్యత ఇలాటి మార్పులను కలిగిస్తుంది..


చివరిగా, శరీర తత్వాలు సాధారణంగా సందేహాస్పదంగా వుండవు. ఆయుర్వేద విధానం గురించి మరింత తెలుసుకునే కొద్దీ మీరు చెప్పే సమాధానాలలో ఏవి వాత అసమతుల్యత వలన అనుకున్నవీ, ఏవి మీ సహజ స్వభావానికి అనుగుణంగా అనుకున్నవీ మీకు అవగతమవుతుంది. అయినా మీరు అయోమయం నుంచి బయటపడలేకపోతే ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోండి.


శరీరతత్వం గురించి తెలుసుకున్న తర్వాత దాని అర్థం తెలుసుకోవడం కూడా అవసరం. ఆయర్వేద విధానం జన్యుసంబంధమైన విధానం అనేది గుర్తుంచుకోవల్సిన ముఖ్యాంశం. డి.ఎన్.ఏ. సిద్ధాంత ఆవిర్భావానికి ఎంతో పూర్వమే ఆయుర్వేద ఋషులు జన్యుపరమైన లక్షణాలు ఉమ్మడిగా వస్తాయని గ్రహించారు. 


శరీరతత్వం అంటే మనం ఒక అదృశ్యశక్తితో పోతపోయబడిన పద్ధతి అయితే దీనిలో మన అదృష్టం అంటూ ఏదీ వుండదు. పాడవు లేక పొట్టి అనిశ్చితత లేక స్థిరనిశ్చయం, ఆతురత లేక ప్రశాంతత కలిగి వుండడం అనేది ఒక తీరు. శరీరతత్వం అదుపు చేయలేని ఆలోచనలు, మనోవికారాలు. జ్ఞాపకాలు, ప్రజ్ఞాపాటవాలు, వాంఛలు, మరెన్నో వాటికి ఇక్కడ చోటుంటుంది. శరీరతత్వం తెలిస్తే మరింత చక్కని ఆరోగ్యస్థితిని సాధించడం సాధ్యమవుతుంది. ఆయుర్వేదం  వ్యక్తిగత సంబంధాలు, పనిలో సంతృప్తి, ఆత్మ ఎదుగుదల, సాంఘిక కలివిడితనం వంటి మనసు, శరీరంతో అతి సన్నిహితంగా కలిసి వుండే అన్ని జీవనాంశాలను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళాలని ఉద్దేశిస్తుంది. కనుక తత్వం గురించి క్షుణ్ణంగా తెలిస్తే, ఒక్క ఔషధంతోనే వాటినన్నిటినీ ప్రభావితం చేయొచ్చు. ఆయుర్వేదం పురోగమించే విధానం అదే.


వాతతత్వ లక్షణాలు


1. తేలికపాటి, బక్క శరీరాకృతి

2. వేగంగా పనిచేయడం

3. క్రమంలేని ఆకలి, అరుగుదల

4. మగత నిద్ర, కలత నిద్ర, నిద్రలేమి

5. ఉత్సాహం, జీవచైతన్యం, ఊహాశక్తి

6. ఉద్వేగం, మారే మూడ్లు

7. కొత్త సమాచారాన్ని త్వరగా గ్రహించడం, త్వరగా మర్చిపోవడం

8. చింతాక్రాంత ధోరణి

9. మలబద్ధకానికి గురికావడం

10. తేలిగ్గా అలసిపోవడం, అతిగా కష్టపడే ధోరణి

11. అలల్లా వెలువడే మానసిక, శారీరక శక్తి 


వాతతత్వం ముఖ్యలక్షణం 'మారగలగడం'. వాతతత్వం గలవారి గురించి చెప్పడం కష్టం. పిత్త, కఫ తత్వాల వారిలా ఒకేరకంగా వుండరు. అయితే పరిమాణం, ఆకారం, మూడ్, క్రియలలో వీరి వైవిధ్యత కూడా వీరిని గుర్తించే లక్షణమే. నిశ్చలంగా కాక అలలు అలలుగా వెలువడే మానసిక, శారీరక శక్తి దీనికి కారణం.


1. పగలు లేక రాత్రి ఎప్పుడూ ఆకలిగా వుండడం

2. ప్రేమోద్వేగం, స్థిరమైన మార్పు

3. ప్రతి రాత్రి వేర్వేరు సమయాలలో నిద్రించడం, భోజనం మానేయడం, సాధారణంగా అపక్రమమైన అలవాట్లు కలిగి వుండడం

4. ఒకరోజు ఆహారం చక్కగా జీర్ణం కావడం, రెండో రోజు సరిగా జీర్ణం కాకపోవడం

5. త్వరగా వచ్చి, త్వరగా మరిచిపోయే ఉద్రేకొద్వేగాలు ప్రదర్శించడం

6. వడివడిగా నడవడం

అనేవి కూడా అతి వాతతత్వ లక్షణాలే.  వీటిని ఓపిగ్గా, సహనంతో, గ్రహించాలి 


భౌతికంగా, వాత తత్వం గలవారు మిగతావారికన్నా సన్నగా, చిన్న భుజాలు, చిన్న పిరుదులు కలిగివుంటారు. కొందరి విషయంలో వళ్ళు చేయడం అసాధ్యం; మిగతావారు సన్నగా, నాజూగ్గా వుంటారు. రకరకాల రుచులు కలిగిన వారున్నా నాతతత్వంగలవారు లావెక్కకుండా ఏదైనా తినగలరు. (కొంతమంది జీవితంలో బరువు విషయంలో బాగా మార్పులకి గురౌతారు. యవ్వనంలో సన్నగా వుండి, మధ్య వయస్సులో లావెక్కుతారు). వాతం పెరిగితే భౌతిక అపసవ్యత ఏర్పడుతుంది. శరీరానికి పుండవలసిన వాటికన్నా బాగా పాడవో లేక పొట్టో అయిన కాళ్ళుచేతులు; బాగా చిన్నవి లేక బాగా పెద్దవి, బయటికి పాడచుకొచ్చి కనిపించేవి అయిన దంతాలు: అతి ఆకలి కలిగి వుండడం వాత లక్షణాలు. వాతతత్వం గలవారిలో ఎక్కువమంది చక్కటి ఆకారం కలిగివున్నా, దొడ్డికాళ్ళు, సన్నటి మడమలు, గూని, బాగా దగ్గరగా లేక బాగా ఎడంగా వుండే కళ్ళు గలవారు కూడా వీరిలో కనిపిస్తారు. ఎముకలు బాగా తేలికగా లేక బాగా పొడవుండి బరువుగా వుంటాయి. కీళ్ళు, ధాతువులు, నరాలు చర్మం అడుగున వుండే కొవ్వు పొర పల్చగా వుండడం చేత చక్కగా పైకే కనబడ్తుంటాయి.


శరీరంలోని చలనం అంతటికీ వాతమే కారణం. మన దేహంలోని కండరాలు వాతం వలనే చలిస్తాయి. శ్వాసను నియంత్రించడం, జీర్ణమార్గం ద్వారా ఆహారం కదలడం, మెదడు జారీచేసే ఆదేశాలు నరాల ద్వారా తీసుకుపోవడం చేసేది వాతమే కేంద్ర నాడీ వ్యవస్థను అదుపు చేయడం వాతం చేసే అతి ముఖ్యమైన పని. వళ్ళు బిగుసుకోవడం, కండరాలు ముడుచుకుపోవడం, తీవ్రమైన వణకు శరీరంలోని వాతం కలత చెందిందనడానికి దృష్టాంతాలు. ఈ దోషం అసమతుల్యతలో పడితే, నరాల అపసవ్యత కనిపిస్తుంది. ఇది సాధారణమైన చింత నుంచి తీవ్రమైన మానసిక విపరిణామాల స్థాయి వరకూ వుండొచ్చు. వాతం ప్రకోపిస్తే, అన్ని రకాలైన మానసిక వికార లక్షణాలూ కనిపిస్తాయి. కనుక వాతాన్ని సమతుల్యతలోకి తీసుకురాగలిగితే అలాటి లక్షణాలన్నీ మటుమాయమవుతాయి.


వాతం పనులు ప్రారంభించడానికే తప్ప వాటిని పూర్తి చేయడానికి వుపయోగపడదు. వాతతత్వం అసమతుల్యతలో పడితే బలంగా కనిపించే లక్షణాలు : అలాటివారు ఏమీ కొనకుండానే బేరాలాడతారు. అంతులేకుండా మాట్లాడతారు, ఎప్పుడూ అసంతృప్తికి లోనవుతారు. కొన్ని సమయాలలో వాతతత్వం గలవారు డబ్బుని, శక్తిని, మాటల్ని వృధా చేస్తూ తమని తామే స్వేచ్ఛగా ఖర్చు చేసుకుంటారు. శరీరమంతటా సమతుల్యతకు బాధ్యత వహించే కారణంగా వాతం సమతుల్యతలో వుంటే అలా చేయడం జరగదు.


ఎక్కువమంది వాతతత్వం గలవారు చింతకు గురౌతారు. విశ్రాంతి లేకుండా చేసే ఆలోచన ఫలితంగా ఏర్పడే నిద్రలేమివల్ల కొన్ని సమయాలలో బాధపడతారు. వీరు బాగా తక్కువగా - ఆరు గంటలు లేక ఇంకా తక్కువ సేపు మాత్రమే నిద్రిస్తారు. ఇది వయసు పెరిగే కొద్దీ మరీ తగ్గుతుంది. వత్తిడి కారణంగా ఏర్పడే ప్రతికూల మానసిక పరిణామం చింత (భయం), కడుపులో ఇబ్బంది, నమ్మకంలేని జీర్ణశక్తిలతోపాటు దీర్ఘకాలిక మలబద్ధకము, గాస్ ఇబ్బందులు వుంటాయి. ఈ దోషం వలన జీర్ణక్రియలో అపసవ్యత, స్త్రీలలో ఋతుసమయ బాధ సాధారణంగా ఏర్పడుతుంటాయి.


చక్కటి సమతుల్యతగల వాతతత్వ వ్యక్తి అంటురోగాల బారిన పడకుండా ఆనందంగా, ఉత్సాహంగా, శక్తివంతంగా వుంటాడు. మనసు స్వచ్ఛంగా,



భార్యాభర్తలు ప్రశాంత జీవనసూత్రాలు

   భార్యాభర్తలు ప్రశాంత జీవన సూత్రాలు కుటుంబం అంటే సామరస్యం, అంతే తప్ప సాధించడాలు, కోపాలు, పగలు, ప్రతీకారాలు కాదు, ఎవరూ ఎవరికీ బానిసలు కాదు,...