Labels,

1aaఘంటసాల గీత (1) 1ab108శుక్రవారములువేంకటేశ్వరునిపాదములకుఅభిషేకం (1) 1abనీఆనందంఎక్కడవుందోతెలుసా (1) 1abసులువుగాఆనందంగాబ్రతకడంఎలా (1) 1aవివాహానికిసరిపడునక్షత్రములు (1) 1aశిశువుపుట్టిననక్షత్రముమంచిదాకాదాదోషాలువున్నాయాఇక్కడచూడండి (1) 1aసంతోషం (1) 1bనాపేరునిబట్టినక్షత్రము (1) 1cనవగ్రహరెమిడీస్ (1) 1m100tables (1) 1m100tablesinsinglesheet (1) 1m100tableswithname (1) 1m1to100tablesfor20 (1) 30days (1) 5artbrushes (1) 6qus (1) 9Bhagavadgita (1) 9bottons (1) agecalculatorinyearsmonths (1) ashtotharalu (1) Business (1) Dealoftheday (1) differentappsinthispage (1) differentbrushes (1) DynamicStoryGenerator (1) Flippingcard (1) ghantasalagita (1) Govinda (1) Lawofatraction (1) lovestorygenerator (1) Money (1) MoneyBusinessGovernmentjob (1) muggulu (1) newstylishbuttons (1) omnamahshivaya (1) Onemovement (1) peacockcards (1) super app (1) Superbrush (1) superPasswordGenerator (1) Varietycard (1) vasthu (1) vasthu planer (1) vastu tips (1) Weddinginvitationgenaretor (1) WeddingInvitationGenerator (1) Whatisthis (1) wow app (1) yourrasi (1) అధ్భుతమైనరెమిడీమీకోసం (1) ఆయుర్వేదం (1) ఇక్కడమీపేరునిటైపుచేసిమీలక్కీనెంబర్స్ (1) ఇలావెరైటీగామెసేజ్పంపించండిసర్ప్రైజ్అవుతారు (1) ఏపూజఅయినాపాటించాల్సిననియమాలు (1) కాశీయాత్రవిధివిధానం (1) గ్రామదేవతలవివరాలు (1) తెలుసుకోండి (1) దేవాలయనియమాలు (1) ధనలక్ష్మీప్రాప్తికి (1) ధనాకర్షణ (1) నక్షత్రాలు (1) నవగ్రహపూజలు (1) నాకుబీపీషుగరులేదుఎందుకంటే (1) నువ్వుఎవరుఇక్కడసులువుగాతెలుసుకో (1) నేనుచేస్తున్నతప్పులుఏమిటి (1) పిల్లలకునేర్పాల్సినధ్యానశ్లోకములు (1) పిల్లలకునేర్పించండి (1) బూడిదగుమ్మడికాయకట్టేవిధానం (1) భార్యాభర్తలుప్రశాంతజీవనసూత్రాలు (1) మనసుబుద్ధిఆత్మఎక్కడవుంటాయి (1) మీగోత్రనామాలతోకాశీమహాక్షేత్రంలోమహాశివరాత్రిఅభిషేకం (1) మీనక్షత్రానికిడబ్బులుతెచ్చే3నక్షత్రాలు (1) మీరుమగపెళ్ళివారాఆడపెళ్ళివారాఇక్కడతెలుసుకోండి (1) మీలక్కీనంబర్స్ తెలుసుకోండి (1) రాశిఏదివస్తుంది (1) విధులు (1) వెరైటీక్విజ్ (1) వెరైటీమెసేజ్ (1) శిశువుపుట్టినసమయాన్నిఎలానిర్ణయించాలి. (1) సందేహాలుసమాధానాలు (1) సప్తవ్యసనాలుఅంటేఏమిటి? (1)

3 Apr 2024

భార్యాభర్తలు ప్రశాంత జీవనసూత్రాలు

  భార్యాభర్తలు ప్రశాంత జీవన సూత్రాలు

కుటుంబం అంటే సామరస్యం, అంతే తప్ప సాధించడాలు, కోపాలు, పగలు, ప్రతీకారాలు కాదు, ఎవరూ ఎవరికీ బానిసలు కాదు, పనివారూ కాదు, ఎవరి రూపాయి వారే సంపాదించుకోవాలి , ఒక రాజులా కూర్చో పెట్టి చేతికి కాఫీ అందిస్తే మూతి ముందుకు పెట్టి, చప్పుడు చేస్తూ త్రాగేసి ఊరుకోకుండా , నువ్వు కూడా భార్యని రాణిలా కూర్చోపెట్టి చేతికి కాఫీ అందిస్తే అందులోని శ్రమ, బాధ్యత, అందం , ఆనందం, తృప్తి, తెలుస్తుంది. ఎవరి పని వారే చేసుకోవాలి, వీలైతే ప్రక్క వారికి పనిలో సహకరించాలి, ఖర్చు పెట్టే ప్రతి  రూపాయి  అందరి అంగీకారంతోనే ఖర్చు చేయాలి ,  ఎప్పుడు ఎవరి మధ్య ఏ వాదనలు జరిగినా ఎప్పటికప్పుడు మరిచిపోయేవి మరిచి పోవాలి, క్షమించే అవకాశం వున్న చోట క్షమించండి, వదిలేయండి, అంతే తప్ప మనుషులనూ , వారి వల్ల వచ్చే సమస్యలనూ పట్టుకుని వేళ్ళాడకండి , అప్పుడెప్పుడో జరిగి పోయిన వాటిని తిరిగి గుర్తు చేసుకుని సాధించడం తప్పు, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు, మంచి చెడులు తెలుసుకుంటారు, మారుతూ ఉంటారు, మనసు ఆరోగ్యం పాడు చేసుకోకుండా వీలైనంత ప్రశాంతంగా ఉండండి, ఇంట్లో మిగిలిన వారిని వాళ్ళను వారిలాగానే వుండ నివ్వండి , మీరు మీ లాగే వుండండి, ఏమీ కాదు, భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. భార్య భర్తలు ఎప్పుడు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు.

ఒకరి అభిప్రాయాలకు ఒకరు గౌరవం ఇచ్చి, ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని, ఒకవేళ భాగస్వామి అభిప్రాయాలు నచ్చకపోతే, వాటిని మార్చుకునేలా నిదానంగా చెబుతూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది, అంతే తప్ప వారి నెత్తిమీద కూర్చుని మారాల్సిందేనని బలవంతం చేస్తే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, వాళ్ళ టైము రాగానే నిన్ను తొక్కేస్తారు,

భర్త యొక్క స్వభావం, భర్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఏం మాట్లాడుతాడు ఏంటి అన్ని విషయాలపై భార్యకు అవగాహన ఉండాలి. భర్త ఇష్టాయిస్టాలకు భార్య ప్రాధాన్యత ఇవ్వాలి. భర్త పైన భార్యకు అంతే సంపూర్ణ విశ్వాసం కూడా ఉండాలి. అలాగే భార్య పైన కూడా భర్తకు పూర్తి నమ్మకం ఉండాలి. మంచి విషయం ఏదైనా చెప్ప దలుచుకుంటే చెప్పండి అంతే విన్నారు వినలేదు, వీటితో మీకు సంబంధం లేదు,  భార్య భర్తల మధ్య అనుబంధం గట్టిగా ఉండాలంటే పాటించాల్సిన మరొక సూత్రం. ఒకరిపై ఒకరు గౌరవాన్ని కలిగి ఉండటం. భార్యాభర్తలిద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి. ఒకరిపై ఒకరు తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి. ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా భార్య, భార్యను కించపరిచేలా భర్త ఎప్పుడు ప్రవర్తించకూడదు. భార్యాభర్తలు ఇరువురూ తమ భాగస్వామి యొక్క వ్యక్తిత్వాన్ని అగౌరపరిచేలా ప్రవర్తించకూడదు. భార్య భర్తల ఇద్దరి మధ్య సంపూర్ణ గౌరవం ఉంటే భార్య భర్తల బంధం మరింత బలంగా ఉంటుంది.భార్య భర్త కోసం, భర్త భార్య కోసం సమయాన్ని కేటాయించాలి.కూర్చోవాలి మాట్లాడుకోవాలి, కబుర్లు, సరదాలు, వుండాలి, ఒకరికొకరు ప్రోత్సాహం ఇవ్వాలి మానసిక బలాన్ని ఇవ్వాలి, 

భార్య భర్తలు ఎంత సంపాదించినా, ఏ ఉద్యోగాలు చేసినా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం తాలూకు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించకూడదు. ఇద్దరూ కలిసి మెలిసి ఉండడానికి ప్రయత్నించాలి.

ఎదుటి మనిషి కోరేది మీరు ఇవ్వ లేక పోవచ్చు, మీరు ఇవ్వ కలిగినది ఇవ్వండి అంతే,  భార్య భర్తలు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకోవాలి. ఒకరికి ఒకరు అర్ధమయ్యేలా చెప్పుకోవాలి

ఏ మగాడు నేను మగాడిని అని చెప్పడు, ఏ ప్రేమికుడు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడు, ప్రేమిస్తాడు, అంతే, రెండు శరీరాలలో, రెండు మనసుల్లో, ఒకేసారి పుడితే అది ప్రేమ,  రెండుగా కనిపిస్తూ ఒకటిగా వుండేది ప్రేమ , దానికి భాష లేదు, మనసు మాత్రమే వుంటుంది, దానికి ఏదీ చెప్పనవుసరం లేకుండానే, అన్నీ తెలుస్తాయి, తన భార్య స్వభావం ఏంటి? ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది? వంటి అన్ని విషయాలపై భర్తకు కూడా అవగాహన ఉండాలి. ఆమె ఇష్టాయిస్టాలకు భర్త ప్రాధాన్యత ఇవ్వాలి. భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి సంపూర్ణంగా అవగాహన ఉన్నప్పుడు, ఒకరిపై ఒకరికి బలమైన విశ్వాసం కలుగుతుంది. ఈ బలమైన విశ్వాసమే భార్యాభర్తల బంధానికి బలమైన పునాదిగా మారుతుంది. వారి దాంపత్య జీవితం సుఖంగా సాగడానికి సోపానం అవుతుంది.

2 Apr 2024

మనసు.బుద్ది, ఆత్మ, జ్ఞానం

 వెంకట చాగంటి ( అమెరికా )వారి మాటల్లో

వేదములు రహస్యాలు

మనసు ఎక్కడ వుంటుంది?


మనం చూస్తున్నప్పుడు కళ్ళల్లో వుంటుంది, మాట్లాడేటప్పుడు నోటి యందు వుంటుంది, అంటే మనం ఏ భాగంతో పని చేస్తున్నామో ఆ భాగంలో వుంటుంది మనసు, మనం తెలుసుకో లేనంత వేగంగా మనసు ప్రయాణిస్తుంది, మనసు అంటే ఎనర్జీ అది బ్రెయిన్ నుండి ప్రారంభమవుతుంది , నీరసంగా వున్న శరీరంలో మనసు కూడా బలహీనంగానే వుంటుంది, మనసుకు శక్తిని పెంచకలిగితే అది ఎక్కడికైనా వెళ్ళ కలుగుతుంది 


బుద్ది ఎక్కడ వుంటుంది?


బుద్ది, ఆత్మ తో కూడి వుంటుంది, ఆత్మ ఎక్కడ వుంటే బుద్ది అక్కడే వుంటుంది, బుద్ది మనసు కన్నా సూక్ష్మ మైనది,


ఆత్మ ఎక్కడ వుంటుంది?


మనిషి మెలకువగా వున్నప్పుడు కుడి కంటిలో వుంటుంది, కళ్ళు లేని వారికి కూడా కుడి కంటిలోనే వుంటుంది, మనిషి స్వప్నంలో కంఠంలో వుంటుంది, గాఢ నిద్రలో ఉన్నప్పుడు హృదయం లో ఉంటుంది,  ఆత్మ తో పాటు బుద్ది కూడా అక్కడే వుంటుంది,


జ్ఞానం ఎక్కడ వుంటుంది?


మనసు జ్ఞానం సంపాదించుకుంటుంది,

చేసిన కర్మలు చిత్తం లోకి వెళ్తాయి,

బుద్ది సృష్టి తో పాటే వస్తుంది, ప్రపంచ జ్ఞానం అంతా అందులోనే వుంటుంది, ధర్మం, అధర్మం, అన్నీ వుంటాయి, వాటిని మనం తరిచి తెచ్చుకోవాలి, చాలా సూక్ష్మమైనది,

ఆవేశం లో వున్నప్పుడు మనసు అహంకారం వలన బుద్ధిని సంప్రదించకుండానే స్వతంత్రంగా పనిచేస్తుంది, మనసు మనిషి కంట్రోల్ లో వుంటేనే బుద్ది నుంచి సరైన జ్ఞానం తో సరైన నిర్ణయం తీసుకుంటుంది, బుద్ది తో మాత్రమే పరమాత్మను దర్శించగలం, జిహ్వ చాపల్యం మనస్సుకు వుంటుంది కానీ బుద్ది కి కాదు, బుద్ది ని కాదని మనసు చేసే విరుద్ధమైన పనులన్నీ కర్మలుగా నిక్షిప్తం అవుతాయి, 


సూక్ష్మ శరీరాన్ని చూడగలమా?


విజిబుల్ లైట్ వేవ్ లెంగ్త్ కన్నా తక్కువ వేవ్ లెంగ్త్ వున్న దానిని చూడలేము ,

సత్వ, రజః, తమో గుణాలు మూడు పరమాణువులు సంఘాతం వల్ల ఏర్పడేది ప్రకృతి, దాని నుండి మహతత్వం అనగా బుద్ది ఏర్పడుతుంది, దాని వల్ల అహంకారం, దాని తర్వాత పంచ తన్మాత్రలు, వాటి వలన మనసు, దశ ఇంద్రియాలు, అనగా ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, వీటి వల్ల పంచ భూతాలు, వీటి వల్ల జీవుడు, పరమాత్మ, 


మనిషి మెలకువలో వున్న పుడు మనసు  జాగ్రదవస్థ లో వుంటుంది, నిద్ర లో వున్నప్పుడు మనసు ఇన్ యాక్టివ్ గా వుంటుంది,  గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనసు సుషుప్తి లోకి అనగా పూర్తి ఇన్ యాక్టివేట్ స్థితిలో వుంటుంది, అందువలన జంతువులకు ఇన్ యాక్టివ్ గానూ, చెట్లకు పూర్తి సుషుప్తి లోకి మనసు వుంటుంది, చెట్లకు, జంతువులకు, ఆత్మ, బుద్ది, మనసు వుంటాయి కానీ పైన తెలిపిన స్థితిల్లో వుంటుంది, అందువలన చెట్టు, జంతువులు మనసుతో ఏమీ చేయలేవు, కానీ మనిషి సుషుప్తి లోకి వెళ్లినా, అనగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా జ్ఞానం తో వుంటాడు, 

60 పరమాణువులు 1  అణువు 

2 అణువులు 1 స్థూల వాయువు  అంటే ఎలక్ట్రాన్ , ప్రోటాన్, న్యూట్రాన్, లు ఏర్పడుతుంది  అవి మూడు కలిస్తే తృణపము ఏర్పడుతుంది అలా అగ్ని, జలము, పృథ్వి, ఏర్పడుతాయి, 


ప్రకృతి జీవనం 

ఆత్మ జీవనం

మనుష్య జీవనం 

సప్త వ్యసనాలు అంటే ఏమిటి

 సప్త వ్యసనాలు అంటే ఏమిటి?

ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు.
ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు ఏడు అంటారు. అవేమిటంటే
*1.పరస్త్రీ వ్యామోహం – ఏ కాలంలోనైనా మనిషిని అధఃపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది. ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్నవాళ్ళల్లో పూర్వ కాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ. సీతాదేవిని అపహరించి, ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమేగాక తన కుటుంబాన్నీ, వంశాన్నీ, అయినవారినీ, చివరికి రాజ్యాన్నికూడా కోల్పోయాడు.
*2.జూదం .. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. (ఆంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్తలు తాను పడటమే కాకుండా, తన తమ్ములూ, భార్యా కూడా అవస్తలు పడటానికి కారకుడయ్యాడే, మరి ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాలబారినపడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్తలు పడుతున్నాయో)
*3.మద్యపానం – పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు. అలాంటివాడు మద్యపాన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు.
*4. వేట -- పూర్వం దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి శ్రవణకుమారుడిని చంపుతాడు. ఆయనకి తెలియక చేసిన పాపమయినా శ్రవణుడి వృధ్ధ తల్లిదండ్రుల శాపానికి గురయి తన కుమారుడు శ్రీ రామచంద్రుడికి దూరమయి రాముణ్ణే కలవరిస్తూ మరణిస్తాడు. ఇదివరకంటే కౄర మృగాల నుండి ప్రజలను కాపాడటానికి రాజులు వేటాడేవారు. 
*5. కఠినంగా, పరుషంగా మాట్లాడటం -- దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ. పాండవులను దుర్భాషలాడి ఏ స్దితి తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే.
*6.కఠినంగా దండించటం -- దీనికికూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి ఆహారం కూడా అతి తక్కువ ఇచ్చి నానా ఇబ్బందులూ పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు.
ఈ రోజుల్లోకూడా ఏ కారణంవల్లనైతేనేమి తల్లిదండ్రులు పిల్లల్ని దండించటం, టీచర్లు పిల్లల్ని కఠినంగా దండించటం ఎక్కువైంది. (ఎవరిమీదైనా ఏమైనా కక్షవుంటే దాన్ని తీర్చుకోవటానికి అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు).
*7.ఆఖరిది డబ్బు. కొందరికి డబ్బు వృధాగా ఖర్చుచెయ్యటం అలవాటు. బాగా డబ్బున్నా, క్రమ శిక్షణా, సరైన ఆలోచన లేకపోవటంవల్ల అవసరముందా లేదా అని కూడా ఆలోచించకుండా డబ్బు దుర్వినియోగం చేస్తారు. మహాలక్ష్మిని ప్రయోజనకరమైనవాటికి కాకుండా దుర్వ్యసనాలకు వినియోగిస్తే దుర్గతే లభిస్తుంది అపజయమే తప్ప జయం వుండదు. అందుకే ధనాన్ని సద్వినియోగం చెయ్యాలి.
మంచీ చెడూ తెలుసుకుని మనుగడ సాగించటమే మనిషి జన్మకి సార్ధకత.

 సప్త ఋషులు వారి భార్యలు 


1. అదితి సమేతం కశ్యప మహర్షి

2. అనసూయాసమేతం అత్రిమహర్షి 

3. సుశీలాసమేతం భరద్వాజమహర్షి 

4. కుముద్వతీసమేతం విశ్వామిత్ర మహర్షి 

5. అహల్యాసమేతం గౌతమ మహర్షి 

6. అరుంధతీ సమేతం వశిష్ఠమహర్షి 

7. రేణుకాసమేతం జమదగ్ని మహర్షి

గ్రామదేవతలు వివరాలు

  *గ్రామ_దేవతల_పేర్లు*


*గ్రామదేవతలు 101 మంది  పేర్లు వివరాలు :-*

పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం .

ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు .


1.పాగేలమ్మ

2.ముత్యాలమ్మ

3 .గంగమ్మ

4.గంగానమ్మ

5.బంగారమ్మ

6.గొంతెమ్మ

7.సత్తెమ్మ

8.తాళమ్మ

9.చింతాలమ్మ

10.చిత్తారమ్మ

11.పోలేరమ్మ

12.మావుళ్లమ్మ

13.మారెమ్మ

14.బంగారు బాపనమ్మ

15.పుట్టానమ్మ

16.దాక్షాయణమ్మ

17.పేరంటాలమ్మ

18.రావులమ్మ

19.గండిపోచమ్మ

20.మేగదారమ్మ

21.ఈరినమ్మ

22.దుర్గమ్మ

23.మొదుగులమ్మ

24.నూకాలమ్మ

25.మరిడమ్మ

26.నేరెళ్లమ్మ

27.పుంతలో ముసలమ్మ

28.మాచరమ్మోరు

29.మద్ది ఆనాపా అమ్మోరు

30.సొమాలమ్మ

31.పెద్దయింట్లమ్మ

32.గుర్రాలక్క

33 .అంబికాలమ్మ

34.ధనమ్మ

35.మాలక్షమ్మ

36.ఇటకాలమ్మ

37.దానాలమ్మ

38.రాట్నాలమ్మ

39.తలుపులమ్మ

40.పెన్నేరమ్మ

41.వెంకాయమ్మ

42.గుణాళమ్మ

43.ఎల్లమ్మ 

44.పెద్దమ్మ

45.మాంటాలమ్మ

46.గంటాలమ్మ

47.సుంకులమ్మ

48.జంబులమ్మ

49.పెరంటాలమ్మ

50.కంటికలమ్మ

51.వణువులమ్మ

52.సుబ్బాలమ్మ

53.అక్కమ్మ

54.గనిగమ్మ

55.ధారాలమ్మ

56.మహాలక్షమ్మ

57.లంకాలమ్మ

58.దోసాలమ్మ

59.పళ్ళాలమ్మ

60.అంకాళమ్మ 

61.జోగులమ్మ

62.పైడితల్లమ్మ

63.చెంగాళమ్మ

64.రావులమ్మ

65.బూరుగులమ్మ

66.కనకమహాలక్ష్మి 

67.పోలమ్మ

68.కొండాలమ్మ

69.వెర్నిమ్మ

70.దే శిమ్మ

71.గరవాలమ్మా

72.గరగలమ్మ

73.దానెమ్మ

74.మహాంకాళమ్మ

75.వేరులమ్మ

76.మద్దిరావమ్మ

77.ముళ్ళ మాంబిక

78.యలారమ్మ

79.వల్లూరమ్మ

80.నాగులమ్మ

81.వేగులమ్మ

82.ముడియలమ్మ

83.రేణుకమ్మ

84.నంగాలమ్మ

85.చాగాలమ్మ

86.నాంచారమ్మ

87.సమ్మక్క

88.సారలమ్మ

89.మజ్జిగౌరమ్మ

90.కన్నమ్మ -పేరంటాలమ్మ

91.రంగమ్మ -పేరంటాలమ్మ

92.వెంగమ్మ -పేరంటాలమ్మ

93.తిరుపతమ్మ

94.రెడ్డమ్మ

95.పగడాలమ్మ

96.మురుగులమ్మ 

97.కుంచమ్మ 

98.ఎరకమ్మ

99.ఊర్లమ్మతల్లి

100.మైసమ్మ

101.సుంకాలమ్మవ్వ ఉన్నారు .


#మన_గ్రామదేవతలు_ఎలా_వెలిశారు..?


మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?


#గ్రామదేవతా_వ్యవస్థ:


గ్రామాలలో వెలిసే దేవత...దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను  గ్రామదేవతలని అంటారు.


సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు.


ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు,

ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో,కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే

కుదరకపోవచ్చు.


ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము

సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో

అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు

ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే

తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.


ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త,

ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది.


ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు

అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో

అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా

నియమించారు పూర్వీకులు.


అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.


దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది

కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము

సరైన మూహూర్తములోనే జ్ వేయబడింది కాబట్టి

గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు


భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు.


అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన

ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారాఏదైనా లోటు పాట్లు కలిగివుంటే తొలగుతుంది.


#గ్రామదేవతల_ఆవిర్భావము:


పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది.


అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు

గ్రామదేవతలను ఏర్పాటు చేసారు

తొలి దశలో.


#పృధ్వీ_దేవత:

మొదటిది పృధ్వీ అంటే నేల,ఇది పంటకి ఆధారము,

కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన

పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు.


గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారము

కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు.


జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు.


మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూ వుండడము, దాన్నే సొమ్ముగా

మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ.


పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని

చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి

కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది.


ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో

జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.


#జల_దేవత:

రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది.గుడి ఎత్తుగా కట్టినా

తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.


#అగ్ని_దేవత:

మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ,రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. ( చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబల్లు వాయిస్తారు అది ఉంటూ హారతి చూస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతున్నట్టు కనిపిస్తోంది, ఎప్పుడూ అదే కొనసాగుతోందా తెలియదు).


సూరమ్మను ప్రతి అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమినాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు.


ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళలమ్మ (సూర్య,చంద్రుల కళ వున్న అమ్మ).


#వాయు_దేవత:

నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి.

కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.


#ఆకాశ_దేవత:

ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను

ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు,గాలివాన. ఇలాంటి వాటి నుండి

రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.


#గ్రామదేవతా_నామ_విశేషాలు:


మనం రకరకాల పేర్లతో పిలిచే  ప్రతి గ్రామదేవత

పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది 


సొంతవూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల

రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో

వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది.


ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.


ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి

'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట.

ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు

రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది.


ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే

ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల

(ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేసే+అమ్మ=

కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది.


స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో (స్వచ్ఛమని)సు+అచ్చ= స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.


సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది.

'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో

ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే

క్రమముగా అది మావుళ్ళమ్మ' అయింది.


ప్రజల మనసులో పుట్టే ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా 'తలుపులమ్మ'గా మారింది.ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి

లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.


శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో

అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా

అంకగళమ్మ, అంకాళమ్మ గా మారిపోయింది.


పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ.

ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి.

తన గ్రామములోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత

పిశాచ గణాలను గ్రామములోనికి రాకుండా

వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే.


పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి.

అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో

పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ'

అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు.


సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=

సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.


గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా

ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ. 


అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ పుల్లమ్మ.

ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది

కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.


ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే

చోటవున్న తల్లి అర్పణ+అమ్మ =అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.


బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు

బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ=అప్పలమ్మ అన్నారు.


అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది

బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ

అయినది పెంటి (బాల)+అమ్మ=పెంటమ్మ.


భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో

బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ=

బోనాలమ్మ.


అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి

ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల

పిలుస్తారు.


లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది

కాబట్టి గుర్రాల+అమ్మ=గుర్రాలమ్మ అయినది.


ఊరు పేరుని బట్టి పీల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోల+అంబ='సోమపోలమాంబ'

అన్నారు.సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట..!!


పేర్లు ఏవైతేనేమి 

ఆ తల్లి ఎప్పుడూ మనకు తోడుగా

అండగా నిలిచి మనందరినీ

కంటికి రెప్పలా కాపాడుతుంది..!!

17 Mar 2024

1Bhagavadgita

 

Bhagavad Gita Chatbot

Bhagavad Gita Chatbot

  • Hello! I am the Bhagavad Gita Chatbot. How can I assist you?
Combined Result

23 Feb 2024

Law of attraction system

 

లా ఆఫ్ అట్రాక్షన్ నియమాలు 
కోరుకోవడం, అడగడం, నమ్మడం, పొందడం,

20 Feb 2024

నేను సంతోషంగా వున్నానా లేదా ఎలా తెలుస్తుంది

 నేను సంతోషంగా వున్నానా లేదా ఎలా తెలుస్తుంది 

 చాలామందికి తాము సంతోషంగానే బ్రతుకుతున్నామా లేదా ఇది తెలియకుండానే గడిపేస్తూ వుంటారు. ఇక్కడ మూడు విషయాలు గమనించాలి, అవి ఆరోగ్యం, ధనం, మానసికంగా, ఈ మూడు విషయాల్లో నేను సంతోషంగానే వున్నానా లేదా ఇది ఎప్పటికప్పుడు ఆలోచించుకోవాలి, అవసరమైన మార్పులు చేసుకోవాలి, ప్రస్తుతం మానసికంగా ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకోవాలి దాని గురించి మాట్లాడుకుందాం, ఒక మనిషికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా గడిచిందో అసలు టైమే తెలియ లేదు అనిపిస్తే ఆ రోజంతా అతను సంతోషంగా గడిపినట్లే లెక్క, అతనికి పరిష్కారం దొరకని సమస్యలు ఏమీ లేవని అర్ధం, అలా కాకుండా ప్రతి నిముషం ఒక యుగంలా గడిచిందిరా బాబు అనిపిస్తే ఆరోజంతా అతను తన పరిధిలో పరిష్కారం దొరకని ఏదో ఒక సమస్యతో యుద్ధం చేసాడని అర్థం. ఒక రోజైనా, ఒక నెల అయినా, జీవితం అయినా ఇదే సిస్టం, కాలం గడుస్తున్నట్లు తెలియక పోతే నువ్వు సంతోషంగా వున్నట్లే, అలా సంతోషంగా గడపడానికి ఉపయోగపడే మంచి విషయంతో మరోసారి కలుద్దాం,

How do I know if I am happy?


 Many people spend their time without knowing whether they are living happily or not.  Here are three things to note, namely health, money, mentally, am I happy in these three things or should I think about it from time to time, make necessary changes, let's talk about how to know mentally now, how to know, a man does not know the actual time from morning to evening.  If it seems like he spent the whole day happily, it means that there are no problems that he cannot find a solution to, otherwise every minute has passed like an era.  Whether it is a day, a month or a lifetime, this is the system, if you don't know that time is passing, you are happy, so let's meet again with a good thing that will help you to be happy.










ఎదుటి వారి ప్రేమను గుర్తించడం ఎలా, ఆ కళ్ళల్లో ప్రేమ కనిపించాలి , ఆ కళ్ళు కళ్ళను మాత్రమే చూడాలి, మరో చోట ఆ కళ్ళు ఇరుక్కు పొయాయి అంటే అది ప్రేమ కాదు, నిజాయితీగా ప్రేమించే వాడు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడు, చెప్పాడు అంటేనే వాడు నీ నుండి ఒక గుర్తింపు కోరుకుంటున్నాడు, నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు, అది ప్రేమ కాదు అందులో స్వార్థం వుంది, నిజాయితీ గల ప్రేమ గుర్తింపు కోరదు, తిరిగి ఏది ఆశించదు, ఇవ్వటం మాత్రమే తెలిసినది ప్రేమ, అందుకు నిలువెత్తు నిదర్శనం అమ్మ  ప్రేమ, అంతే ఇంకా వేరే ఉదాహరణలు అవుసరం లేదు, మాటలు అవుసరం లేదు, 

భార్యాభర్తలు ప్రశాంత జీవనసూత్రాలు

   భార్యాభర్తలు ప్రశాంత జీవన సూత్రాలు కుటుంబం అంటే సామరస్యం, అంతే తప్ప సాధించడాలు, కోపాలు, పగలు, ప్రతీకారాలు కాదు, ఎవరూ ఎవరికీ బానిసలు కాదు,...