మేష లగ్నము
మేష లగ్నమున జన్మించిన వారికి గురుభక్తి, దైవభక్తి అధికముగా నుండును. శాంత స్వభావులు, మంచిగ మాట్లాడుదురు, గుణవంతులు, మంచి దేహ ఛాయ కలవారు. ధైర్యవంతులు, కార్యశూరులు. అందరికి ఇష్టమైనవారు. జీవితంలో కొద్దిగానే సుఖ పడుదురు. వీరికి స్వాభిమానము అధికము, ప్రయాణములు ఎక్కువగానే చేయుదురు. కాస్త లోభిగుణముగానే యుందురు. ఓర్పు తక్కువ, కోపము పాళ్ళు ఎక్కువ, మాటల్లో తొట్రుపాటు, సవరణలు వుండును. వెనుక చూపు తక్కువ. పదవులకై ప్రాకులాడుదురు. ఒకరికి తల వంచరు. ఒక్కొక్కప్పుడు లౌక్యుల చేతిలో కష్టనష్టములు పడుట జరుగును. ధనము, వస్తు సామాగ్రి ఎంత వెచ్చించి యైనను పనిని సాధింతురు. పట్టుదల వల్ల దుర్వ్యయము, అపార నష్టము కలుగు చుండును. ఇతరులయందు ఆదరణ చూపెదరు. పరాక్రమము వలన కీర్తిని సంపాదించు కొనుటకు ప్రయత్నింతురు. ప్రతి దానియందు చొరవ, శక్తి, ఆసక్తి, ఉత్సాహము కలిగి యుందురు.
వీరు ఎటువంటి వారి వద్దనైనా నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా, నిర్భయంగ మాట్లాడుదురు. మంచి చెడ్డలతో పని లేక ఆలోచించక ధైర్యసాహసములే లక్ష్యముగా పెట్టుకొని కార్యరంగమున దూకెదరు. ఉద్రేకముతో పనిచేయుదురు. దాన బుద్ధి కలవారు. కష్టములకు కరగుట ఎక్కువ. కల్లబొల్లి
మాటలకు, ఏడుపుకు మోసపోవుదురు. తత్ఫలితముగ అపాత్రదానములు చేయు దురు. స్త్రీలచే మోసపోవుట కూడ జరుగును. వీరు ఉదార స్వభావులు. కాని స్వలాభం కోసం కొంత ప్రయత్నించెదరు. అవసరమైతే పొట్లాటకు కూడ వెనుకాడరు. అనవసరంగ వీరిని కదిలిస్తే ఊరుకోరు. అవసరాన్ని బట్టి ఖర్చుకు వెనుకాడరు. కష్టపడి ఎలా సంపాదింతురో అంతకంటే అధికంగ ఖర్చు చేస్తారు. కొంత దుబారా ఖర్చు కూడ చేస్తారు. అవసరాన్ని బట్టి అభిప్రాయములను మార్చుకొంటారు. వీరిలో ఈర్ష్య, లోభత్వము, కోపము, మొండి.. ధైర్యము, తొందరపడి దూషించుట అనునవి ముఖ్యలక్షణములు. ముందు ఆలోచనలు లేకుండగానే కార్యరంగంలోనికి దూకెదరు. ఇతరులలోని నిగూఢమైన విషయములను బయటకు లాగుదురు. కార్యదక్షత గలవారు. వీరు చిన్నతనములో అనేక కష్టములను అనుభవించి అభివృద్ధిలోనికి వచ్చెదరు.• ఒక్కొక్కసారి దుస్సాహసము వల్ల నష్టపడుదురు. ఇలాంటి విషయాలలో ఆలోచనా శక్తి తక్కువ. ఏ విషయమునందైనను నిష్కర్షగ మాట్లాడి విషయమును వెంటనే తేల్చివేయుదుకు వీరు కాస్త బక్క పల్చగాను సామాన్యంగ మధ్యమ దేహము కలవారైయుందురు. ఒత్తైన కనుబొమ్మలు, గుండ్రని కన్నులు, వాడియైన దృష్టి, శిరస్సుకు సంబంధమైన పొట్ట, మూత్రము, మొ॥వానికి సంబంధించిన అనారోగ్యములు కలుగుచుండున పైత్య ప్రకోపంగ నుందురు. ముఖమునందు వ్రణములు, కురుపులు, చర సంబంధమైన అనారోగ్యములు గుర్తులుండును. వీరికి నీటి భయముండును. ఆరోగ్యమును జాగ్రత్తగ కాపాడుకొన వలసి యుండును . అధికారులతో సామాన్యంగ పడద వృత్తిలో నిలకడ తక్కువ. ధనమును సులభముగా నార్జింతురు. అప్పులు సులభముగా పుట్టును. విద్యయందు విఘ్నములు కలుగును. జన్మస్థలమునకు దూరముగా నుందురు
2 వృషభ లగ్నము
వృషభ జన్మ లగ్నమున పుట్టిన వారు ధనికులు, సుఖములను అనుభ వించువారు. తేజస్వియు, కష్టములకు ఓర్చుకొనువారును, హితభాషి, శతృవులను నివారించువారు. జ్ఞానులు, విశాలమైన నుదురు వక్ష స్థలము గలవారు, సుందర స్వరూపులు. కంటికింపుగా కనిపింతురు. కాస్త కాముకులనే చెప్పాలి. గురుభక్తి దైవభక్తి కలవారు. స్నేహపాత్రులు, ప్రియముగా మాట్లాడుదురు. ప్రశాంతమైన మనుస్సు గలవారు. సుఖజీవి. రహస్య ప్రవర్తన, స్వార్ధము, ఆత్మస్తుతి, దీర్ఘ కోపము,

లక్షణములు. వీరికి తోచిన విధంగానే పనులు చేసికొనుటయే కాని ఇతరుల అభిప్రాయములను, సలహాలను పాటించక పోవుట వీరిలో మరొక సహజగుణము. తనలోని మనోభిప్రాయములను ఇతరులకు తెలియనీయరు. ఏపనినైనను తొందరపడి చేయక నిదానముగ ఆలోచించి సమయానుకూలముగా చక్కబెట్టుకొనుటలో నేర్పరులు. తరచు సౌఖ్యముల కొఱకు తాపత్రయ పడుచుందురు. అనేక మంది స్నేహితులుందురు. వారితో సంభాషించే టప్పుడు పెడసర స్వభావంగ ప్రవర్తింతురు. ఏది తిన్నా పడదు. అజీర్ణం చేస్తుంది.
ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసికోవాలి. వ్యాధి రాదు, వస్తే త్వరగా తగ్గుతుంది. భగంధర, ఆపస్మారక, కంఠస్వర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశము కలదు. మధుమేహము, గొంతు, మెడకు సంబంధించిన వ్యాధులు కూడ రావచ్చును. శరీరమునకు సంబంధించిన ఆరోగ్య విషయములలో చాల జాగ్రత్తగ ప్రవర్తించవలెను. ఏ వ్యాధులు రాకుండగ చూచుకోవాల్సిన బాధ్యత కలిగి మెలగాలి.వీరికి ఆభరణములందు మక్కువ ఎక్కువ. సంగీత ప్రియులు. బాల్యమున అనేక కష్టములను అనుభవించెదరు. యౌవనమున, వృద్ధాప్య దశలయందు వీరి జీవనము సుఖసంతోషములతో గడచిపోవును. వీరు భోజన ప్రియులు. మధుర పదార్ధములనిన ఇష్టము. వీరిలో క్షమాగుణము కలిగియున్నను తీవ్రమైన కోప ముండునని చెప్పవలెను. వీరు ధన విషయమునందు కడుజాగ్రత్తగా వర్తింతురు.వీరివి స్థిరమైన అభిప్రాయములు పట్టిన పట్టు విడవకుండుట, తన స్వభావమును ఇతరులకు తెలియనీయకుండుట, వారి మనోగతాభిప్రాయములను లాగుట వీరి లక్షణము. మనస్సులోనున్ను అభిప్రాయమునకు వ్యతిరేకముగ వాదిం తురు. సౌమ్యముగా కనిషింతురు. వచ్చిన కోపము పోదు. స్వలాభ బుద్ధి ఎక్కువ. ఆజన్మాంతము లౌక్యము, దురభిప్రాయము, ద్వేషము వీరిలో అంతర్లీనమై వుంటాయి. చెప్పినది కాదనరు కాని తమ ఉద్దేశ్యము ప్రకారం వర్తింతురు. కష్టములను, పరాజయములను రహస్యముగా సహించి తమ ఉద్దేశ్యమునకు అనుకూలముగ పనిని సాధించుకొందురు. ఎంతకాలమైనను ఎంత కష్టమైనను విసుగురాదు. సంకల్పము చెదరదు. శారీరక, మానసిక శ్రమలకు ఓర్చి చాకిరీ చేయగలరు. పొరపాటు లేకుండా యధావిధిగా పనులు చేసి జయమందుదురు. అట్టి క్రమముననే ఇతరుల తప్పులను గ్రహించి దెబ్బ తినిపించగలరు. సుఖపడుట తెలిసిన వారు. తన సుఖమునకడ్డు వచ్చిన వారిని లెక్కచేయరు. భోజన శయ్యానన ప్రియులు. ఎంత కష్టపడుదురో అంత సుఖపడగలరు. తమ వస్తువులు, ఆస్తిపాస్తులలో గడ్డిపరకను కూడ లెక్కింతురు. చించి పారవేయవలసిన ఉత్తరాలను కూడ భద్రముగా దాచిపెట్టెదరు. తన ధన, వస్తు లాభ గౌరవములను పది మంది చెప్పుకొనుట వీరి జీవితాశయము. వీరు జీవించు పద్ధతిని చూచి (తమ కంటె) తానున్న స్థితికన్న ఎక్కువ ధనవంతుడని, ఇతరులు పొరపాటు పడుదురు.వృత్తిలో చిన్నవారితోను, అధికారులతోను పేచీ పడుచుందురు. తండ్రి సంప్రదాయము, సాంఘిక గౌరవము, పరిసరములందు పలుకుబడి కలవాడు. అది వీరు సంపాదించు కోవలెనన్న జీవితాన్ని కట్టుదిట్టంగ చేసికొని నడవాలి.