సందేహాలు సమాధానాలు
అమ్మవారికి గాని లేదా స్వామి వారికి గాని కట్టిన వస్త్రాలు మళ్లీ బయట వాళ్లు భక్తులు కట్టవచ్చా లేదా ఈ సందేహమును తీర్చగలరు
శేష వస్త్రం కదా కట్టుకోవచ్చు
యజమానికి ఉద్యోగరీత్య పై అధికారితో ఇబ్బందులు వస్తున్నాయి వారికి అనుకూలమైనటువంటి స్థలానికి స్థాన చలనం కావాలని అనుకుంటున్నారు వీరు కానీ వారి యొక్క ధర్మపత్ని గాని స్వయంగా గృహంలో స్వహస్తాలతో ఏదైనా సులభమైనటువంటి పరిహారం చేసుకునేటువంటి మార్గాన్ని సూచించ ప్రార్థన
శనివారం నుంచి వచ్చే శనివారం వరకు ఐదు ఒత్తులు వేసి ప్రత్యేక దీపారాధన చేయాలి అలాగే గణపతికి బహుళ చవితి నుంచి శుద్ధ చవితి వరకు రోజూ గరిక ఎర్రని అక్షింతలతో అష్టోత్తరం చెయ్యాలి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి బెల్లం ముక్క నివేదన పెట్టాలి అలా చేసిన. మీకు అనుకూల మైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది
పిల్లలు లేనివారు. సంకల్పంలో ఏమని చెప్పాలి
పిల్లలు లేనివారు , సకల గ్రహ దోష నివారణ సిధ్యర్థం. శ్రీఘ్రమేవ సత్సంతాన ప్రాప్యర్థం అనీ,
పిల్లలు గలవారు సకల సౌభాగ్య సిద్ధ్యర్ధం మమ సంతాన సకలాభివృద్ధ్యర్థం అని చదువుకుంటే సరిపోతుందండి!!
అక్షింతలు అన్న పదం కరెక్టేనా ఎలా పలకాలి
అక్షింతలు అనకూడదు అక్షతలు అనాలి