అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి.. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి.నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపం పెట్టాలి, శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు నువ్వుల నూనెతో నిత్యా దీపారాధన చేయాలి.అని గురువుల సందేశం, ప్రయత్నించి చూడండి.
వ్యాపారం అభివృద్ధికి లాభాలకు ప్రతి బుధవారం ఆవు పాలతో చేసిన క్షీరాన్నం లక్ష్మీ దేవికి నైవేద్యంగా పెడితే మంచిదని, దీనివల్ల రుణబాధలు తీరుతాయి అని గురువులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఇంట్లో సాయంత్రం పూట గోమయం, సాంబ్రాణితో ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరుతాయి అని, నల్ల చీమలకు చక్కెర వేయడం వల్ల సంపాదనలో స్థిరత్వం వస్తుందని, వ్యాపారాలు లాభసాటిగా మారతాయని గురువుల భోధన.
జపం చేసే జపమాల చూపుడు వేలుపైన తిప్ప కూడదు మధ్య వేలు తోనే చేయాలి.
పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకంకి వాడకూడదు.
పులిహోరచేసి దేవుడికి నివేదన చేస్తే జేష్ఠదేవి పెట్టె కష్టాలనుండి ఉపశమనం లభిస్తుంది, పులిహోరచేసి పంచి పెడితే జేష్ఠ దేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండకునే వాళ్ళు... పంచి పెడితే ఇంకా మంచిది.
జపానికి వాడే జప మాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడ కూడదు..
రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు, ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటూ వంట చేయకూడదు. తినే వారు కూడా తిట్టుకుంటూ తింటారు.. సంతోషంగా వంటచేస్తే సంతోషంగా తింటారు..._
పూజగది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడిని ఫోటో కానీ విగ్రహం గాని పెట్టకూడదు.
సూర్యుడి విగ్రహం ప్రత్యేకంగా పెట్టి చేసే పూజ కన్నా ప్రాతఃకాల సూర్య బింబం చూస్తూ చేసే ఆరాధన అధిక ఫలితం ఇస్తుంది
పూజ పూర్తి అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం కళ్ళకు అద్దుకుని ప్రసాదంగా తప్పని సరిగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి.
పూజ గది గోడకు మీ మీ సాంప్రదాయ విధానాన్ని అనుసరించి పసుపు రాసి కుంకుమ పెట్టి పూజించడం సంప్రదాయం, ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరించి మంచి ఫలితాలు పొందుతున్నారు
దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుకభాగం (బలిపీఠం దగ్గర) తాకడం కానీ తల అనించడం కానీ చేయకూడదు, చెట్టుకింద వాయు ప్రతిష్ట చేసిన శివలింగాలకు తల ఆనించి డిచ్చి కొటేస్తుంటారు కొందరు దేవుడి విగ్రహాలకు తలతో డిచ్చి కట్టకండి. అది ఆరాధన కాదు
ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో గాని విగ్రహం కన్నా, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు
కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫొటో గాని చిన్న విగ్రహం కానీ ఉండవచ్చు.
గవ్వలు లక్ష్మీదేవికి తోబుట్టువులు అని అంటారు . లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో (వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచితే అమ్మవారికి చాలా ఇష్టం,పాలసముద్రం నుండివచ్చిన తల్లి కాబట్టి ఆమె పుట్టింటి వారిని తోడుగా కూర్చోబెట్టి నట్టు, అందుకే అక్కడ ఉన్న గవ్వలు కూడా అమ్మవారికి పూజ గదికి దిష్టి తగలకుండా కాపుకాస్తాయి.నిత్యం పూజ జరిగేలా పూజకు ఆటంకాలు రాకుండా వుంటుంది.
దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు, పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్ళకూడదు..
కాళికా, ప్రత్యంగిరా దేవి వంటి అమ్మ ఆరాధనలు అమ్మ ఆరాధనా విధానం తెలిసిన గురువుల సలహాలు తీసుకుని స్త్రోత్రాలు, అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు.
గృహంలో విగ్రహం పరిమితి చిన్నదిగా ఉంటే మంచిది, చక్కని పూజా విధానముతో పూజ చేయాలి లేదా పండో పాలో పెట్టి హారతి ఇస్తే సరిపోతుంది, పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే రోజూ పూజ లేకుండా ఉండకూడదు..
ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు.
షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు, రాత్రి పూట తల చిక్కు తీయకూడదు, పెరుగు చేతితో చిలక కూడదు..
ఎప్పుడూ నిద్రపోతూ ఉండే వాడు, అసలు నిద్రపోకుండా ఉండే వాళ్ళు, ఎప్పుడూ తింటూనే ఉండే వారు, అసలు ఆహారం పైన శ్రద్ద లేకుండా పస్థులు ఉపవాసాలు ఉండే వారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధార పడి బతకడం ఇవి తప్పు.
నీరు, పాలు, పెరుగు, నెయ్యికి అంటు ఉండదు.అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు..
ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు, ఇంకొకరు ధరించ కూడదు..!_
ఇంటి గుమ్మానికి దిష్టి నివారణ కోసం దిష్టి నివారణ యంత్రం పెట్టడం మంచిది.
ఇంట్లో తరచుగా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. దిష్టి దోషం పోతుంది.ఇంట్లో గాలి పరిశుభ్రం అవుతుంది.
అద్దె ఇల్లు వాస్తు మీ జాతకనికి సరిపడ లేదని అనిపిస్తే తొమ్మిది రంగులు కలిసిన wallmat గోడకు డెకరేషన్ గా పెట్టాలి.
ఇంట్లో పిల్లలు ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటోగా పెట్టాలి, అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడల్లా ఒకసారి ఆ నామం మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది. మంచిది.
ఇంట్లో లక్ష్మీదేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది.

